అలనాటి తార శ్రీదేవి గారాల పట్టి, బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అటు నార్త్ తో పాటు సౌత్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. `దేవర` చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో `పెద్ది` సినిమా చేస్తోంది. అలాగే `దేవర 2` ఆమె లైన్ లో ఉంది. బాలీవుడ్ లోనూ పలు క్రేజీ ప్రాజెక్టులకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. జాన్వీ కపూర్ చాలా ఏళ్ల నుంచి శిఖర్ పహారియాతో ప్రేమాయణం సాగిస్తోంది.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడే శిఖర్ పహారియా. ఇతను ఒక ప్రొఫెషనల్ పోలో ఆటగాడు మరియు వ్యాపారవేత్త. జాన్వీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టక ముందు నుంచే శిఖర్ తో లవ్‌లో ఉంది. మధ్యలో ఇద్దరికీ బ్రేకప్ అవ్వడం.. ఆ తర్వాత మళ్లీ ప్యాచప్ చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఇక గత రెండేళ్ల నుంచి శిఖర్ తో జాన్వీ డీప్ రిలేషన్ ను మెయింటైన్ చేస్తోంది. వెకేషన్స్, ఫంక్షన్స్, టెంపుల్స్, పార్టీలు.. ఇలా ఎక్కడికెళ్లినా వీరిద్దరూ జంటగానే కనిపిస్తున్నారు.
బోనీ కపూర్ కూడా శిఖర్ తోనే జాన్వీ పెళ్లి అంటూ పరోక్షంగా హింట్స్ ఇస్తూనే ఉన్నారు. మరోవైపు జాన్వీ ప్రియుడిపై తనకున్న ప్రేమను అనేక విధాలుగా వ్యక్త పరుస్తోంది. టైమ్ దొరికినప్పుడల్లా శిఖర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగేస్తుంది. ఇక తాజాగా మరోసారి పబ్లిక్ లో జాన్వీ బోల్డ్ గా వ్యవహరిస్తోంది. ప్రియుడితో జంటగా కనిపించిన జాన్వీ.. ఈసారి శిఖర్ ఫోటోలతో కస్టమైజ్ చేయించిన టీ షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. జాన్వీ ధరించిన టీ-షర్ట్‌పై శిఖర్ షర్ట్ లెస్ ఫోటో కూడా ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఫిక్స్ వైరల్ గా మారడంతో నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. ప్రియుడిపై ప్రేమ ఉండొచ్చు.. కానీ పబ్లిక్‌లో దాన్ని ఈ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయడం కొంచెం ఓవర్ అయిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.