తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని కలిగి ఉన్నారు. ఇన్నేళ్ల ఫిల్మ్ కెరీర్ లో ఆయన టచ్ చేయని జోనర్ లేదు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్.. ఇలా అన్ని జోనర్స్ లో బాలయ్య సినిమాలు చేశారు. ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. ఇప్పటికీ హీరోగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. అయితే బాలయ్య ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ అందరిలోనూ ఇద్దరు హీరోయిన్లు మాత్రం ఆయనకు చాలా చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్ నటి టబు. ఈ అందాల భామ బాలకృష్ణకు భార్యగానే కాకుండా తల్లిగా కూడా నటించారు. `చెన్నకేశవరెడ్డి` 2002లో విడుదలైన బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో వి.వి. వినాయక్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలకృష్ణ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయగా.. టబు ఆయనకు భార్యగా మరియు తల్లిగా డబుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను పోషించారు. నిజానికి టబు పోషించిన పాత్రకి మొదటి సౌందర్యను సంప్రదించారట. కానీ ఆమె నో చెప్పడంతో టబు చేయడం జరిగింది.
ఇక ఆమె తర్వాత బాలయ్యకు భార్యగా, తల్లిగా నటించిన ఘనత ఒక్క హనీరోజ్ మాత్రమే దక్కింది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ `వీరసింహారెడ్డి`. 2023లో రిలీజ్ అయిన మూవీ ఇది. అయితే ఈ చిత్రంలోనూ బాలయ్య తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించారు. ఆయనకు ఫ్లాష్ బ్యాక్‌లో భార్యగా, ఆపై తల్లిగా నటించి హనీరోజ్ బాగానే మెప్పించింది. మొత్తంగా బాలకృష్ణ కెరీర్ లో ఆయనకు భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్లుగా టబు మరియు హనీరోజ్ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు