రితికా సింగ్.. ఈ బ్యూటీ గురించి పరిచయాలు అక్కర్లేదు. తమిళ్-హిందీ ద్విభాషా చిత్రం `ఇరుధి సుట్రు`తో ఈ ముద్దుగుమ్మ తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో `గురు` పేరుతో రీమేక్ చేశారు. ఇక్కడ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించారు.
రియల్ లైఫ్‌లో బాక్సర్ అయిన రితికా సింగ్.. రీల్ లైఫ్‌లోనూ అదే పాత్రను పోషించి ఆకట్టుకుంది. ఒకే మూవీతో మూడు భాషల్లోనూ ప్రేక్షకులకు చేరువైంది. కానీ, ఈ అందాల భామకు అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. తెలుగులో గురు తర్వాత `నీవెవారో`, `వలరి` వంటి చిత్రాల్లో మెరిసింది.
అటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో చేసిన చిత్రాలను కూడా వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అవకాశాలు రాకో.. లేక వచ్చిన అవకాశాలు నచ్చకో తెలియదు గానీ.. వెండితెరపై రితికా సింగ్ అంత జోరు చూపించలేకపోతుంది.
అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు చేసే రచ్చ రచ్చ అంతా ఇంతా కాదు. బాక్సింగ్ వీడియో, డ్యాన్స్ వీడియోలతో పాటు ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోషూట్లతో రితికా కుర్రాళ్లకు వెర్రెక్కిస్తుంటుంది. అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపుతుంటుంది.
తాజాగా కూడా బాడీ కాన్ డ్రెస్ లో ఎద అందాలను హైలెట్ చేస్తూ రెచ్చిపోయింది. కర్లీ హెయిర్, కిల్లింగ్ లుక్స్ తో కుర్రాళ్ల బుర్ర పాడు చేసే ప్రయత్నం చేసింది. రితికా సింగ్ తాజా ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రస్తుతం రితికా చేతిలో ఎటువంటి సినిమాలు లేదు. చివరిగా ఈ భామ `వెట్టైయన్` మూవీతో పలకరించింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు