కళ్యాణ్ రామ్ హీరోయిన్ ఇంట విషాదం..ఎమోషనల్ పోస్ట్ చేసిన హీరోయిన్..!
స్టోరీస్ లో ఇలా రాసుకుంటు.. నా ప్రియమైన తల్లి శ్రీమతి సయీద గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడిందని.. మంగళవారం రోజున అల్లాహ్ వద్దకు వెళ్ళింది అంటు తెలియజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు, నేటిజన్స్ సైతం సంతాపాన్ని తెలియజేస్తున్నారు. సనా ఖాన్ మొదట బొంబాయి టు గోవా అనే చిత్రంలో స్పెషల్ సాంగ్లో కనిపించింది. ఆ తర్వాత వెంటనే ఈరోజు సల్మాన్ ఖాన్ నటించిన జై హో చిత్రంలో నటించింది.
ఆ తర్వాత కొన్ని చిత్రాలలో నటించిన ఈమె తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా నటించింది. అలాగే బిగ్ బాస్ షో లో కూడా కనిపించిన సనా ఖాన్ కెరియర్ సాఫీగా సాగుతున్న సమయంలో ముస్లిం గురువు ముఫ్తీ అనాస్ సయ్యద్ ను వివాహం చేసుకుంది వీరికి ఒక బాబు కూడా పుట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరమై ప్రస్తుతం తన కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తనకు తన భర్తకు సంబంధించిన అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటుంది సనా ఖాన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోస్ట్ కూడా వైరల్ గా మారుతోంది.