విజయ్ సినిమాకు బాలయ్య ప్రేరణ !
‘తేరి’ తర్వాత విజయ్ పోలీస్ పాత్రలో నటించింది ఈసినిమా మాత్రమే. దీనికితోడు గత సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ప్రమోషన్ లో తమిళ నటుడు విటి గణేష్ ఇచ్చిన లీకులు బాలయ్య అభిమానులలో అనేక చర్చలకు ఆస్కారం కలిగిస్తోంది. వాస్తవాని ఈసినిమా పై వస్తున్న గాసిప్పులను ఈమూవీ నిర్మాతలు ఖండిస్తున్నప్పటికి విజయ్ లేటెస్ట్ మూవీ బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి రీమేక్ అన్న ప్రచారం కొనసాగుతూనే ఉంది.
అయితే తమిళ మీడియా ఈ విషయంపై మరో విధంగా ఊహా గానాలు చేస్తోంది. బాలయ్య ‘భగవంత్ కేసరి’ మూవీలోని ఒక పాయింట్ మాత్రమే తీసుకుని పూర్తిగా కొత్త కథ వ్రారాసుకున్నా అనే వార్తలు వస్తున్నాయి. అయితే విజయ్ ‘జన నాయకుడు’ టీజర్ లో ఖాకీ దుస్తులు చూస్తుంటే ‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు రావడం సహజం అంటూ బాలయ్య అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.
ఈమూవీ క్యాస్టింగ్ పరంగా చూస్తే హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తూ ఉంటే తెలుగులో శ్రీలీల చేసిన పాత్రను తమిళంలో మమిత బైజుతో చేయిస్తున్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వవచ్చే ఏడాది జనవరి 9 ‘జన నాయకుడు’ తమిళ నాడుతోపాటు తెలుగు రాష్ట్రాలలో కూడ విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో తమ హీరో విజయ్ తమిళ నాడు ముఖ్య మంత్రి అవుతాడని అతడి అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు..