సమంత.. ఈ స్టార్ బ్యూటీకి ఉన్న క్రేజ్ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా సూపర్ సక్సెస్ అయిన సమంత.. ఫ్యాషన్ ప్రపంచంలోనూ బలమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. రెడ్ కార్పెట్ అయినా.. సినిమా ఈవెంట్ అయినా.. అందరి చూపులు తన వైపుకు ఎలా తిప్పుకోవాలో సమంతకు బాగా తెలుసు. తాజాగా ఈ సుందరి దుబాయిలో ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైంది.
ఈ సందర్భంగా సమంత గోల్డెన్ శారీలో మెరిసింది. చీర వల్ల సమంతకు అందం వచ్చిందో.. లేక సమంత వల్లే చీరకు అందం వచ్చిందో తెలియదు కానీ ఆమె లుక్ మాత్రం అందర్నీ విశేషంగా కట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. గోల్డెన్ సారీ లో సమంత గ్లామర్ చూసి కుర్రాళ్ళు ఫ్లాట్ అయిపోతున్నారు. ఇక చీర ధరెంతో తెలిస్తే మతి పోవడం ఖాయం.
దుబాయ్‌లో సమంత కట్టుకున్న చీరను ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ రూపొందించారు. చీర ధర అక్షరాల రూ. 3.95 లక్షలు. సమంత రేంజ్‌కి ఇది ఎక్కువ కాకపోయినా.. సామాన్యులు మాత్రం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా, సమంత ఇటీవల నిర్మాణంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె నిర్మించిన తొలి చిత్రం `శుభం` బాక్సాఫీస్ వద్ద క్లాస్ హిట్ గా నిలిచింది. నటిగా నెట్‌ఫ్లిక్స్ కోసం `రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్‌డమ్` మరియు సొంత నిర్మాణలో `మా ఇంటి బంగారం` చిత్రాల్లో సమంత యాక్ట్ చేస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు