ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దమైన ఇప్పటికీ సరిగ్గా నిలదొక్కుకోలేకపోయింది ప్రగ్యా జైస్వాల్. నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోయిన్లు చేతినిండా సినిమాలతో యమా జోరు చూపిస్తుంటే.. ప్రగ్యా జైస్వాల్ మాత్రం అందుకు భిన్నంగా నత్త నడక నడుస్తోంది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ సుందరి.. మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. 2014లో `డేగ(తమిళంలో విరట్టు)` చిత్రంతో హీరోయిన్ గా మారింది.
అదే ఏడాది `టిట్టూ ఎం.బి.ఎ` మూవీతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. 2015లో విడుదలైన తెలుగు చిత్రం `కంచె`తో ప్రగ్యా జైస్వాల్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కానీ ఆ తర్వాత ప్రగ్యా చేసిన చిత్రాలను వేళ్ల పై లెక్క పెట్టవచ్చు. `ఓం నమో వేంకటేశాయ`, `గుంటూరోడు`.`నక్షత్రం`, `జయ జానకీ నాయకా`, `ఆచారి అమెరికా యాత్ర` వంటి సినిమాల్లో ప్రగ్యా యాక్ట్ చేసింది. దురదృష్టం ఏంటంటే.. ఈ చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.
కెరీర్ క్లోజ్ అనుకుంటున్న సమయంలో ప్రగ్యా జైస్వాల్ కు `అఖండ` రూపంలో బిగ్ హిట్ పడింది. ఈ మూవీ సక్సెస్ తో అయిన ప్రగ్యా కెరీర్ ఊపందుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ అలా ఏమీ జరగడం లేదు. అఖండ తర్వాత ప్రగ్యా నటించిన `సన్ ఆఫ్ ఇండియా` ఫ్లాప్ అయింది. అసలు ఈ సినిమా రిలీజ్ అయిందన్న సంగతి కూడా ఎవరికీ తెలియదు. దాంతో ప్రగ్యాకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.
ఈ గ్యాప్ లో `ఖేల్ ఖేల్ మెయిన్` అనే హిందీ మూవీతో బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఆఫర్లు లేక అల్లాడిపోతున్న ప్రగ్యాను `డాకు మహారాజ్`తో మళ్లీ బాలయ్యే ఆదుకున్నారు. ప్రస్తుతం అమ్మడు `అఖండ 2`, `టైసన్ నాయుడు` చిత్రాల్లో నటిస్తోంది.
ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే ప్రగ్యా.. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోలతో కుర్రకారుకు మంచి ట్రీట్ ఇస్తుంటుంది. తాజాగా బ్లాక్ కలర్ మినీ ఫ్రాక్‌లో థై అందాలను చూపుతూ ఆల్మోస్ట్ హార్ట్ ఎటాక్ తెప్పించేస్తుంది. గత్తరలేపుతున్న ప్రగ్యా సొగసులు చూసి నెటిజన్లు అల్లాడిపోతున్నారు. ఆమె తాజా ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.