ఆ నిర్మాతలను టార్గెట్ చేసిన బండ్ల.. ఆస్కార్ నటులు అంటూ సెటైర్!
అయితే ఇందులోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన నోట్ కూడా వివాదాస్పదంగా మారింది. సినిమా టికెట్ ల రేట్ కోసం మాత్రమే నిర్మాతలు వస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఇష్యూపై సీనియర్ హీరోలు సైతం స్పందించారు. ఈ క్రమంలో దిల్ రాజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. థియేటర్ లు బంద్ చేయాలనే వివాదం తూర్పుగోదావరి జిల్లా నుండి మొదలైందని తెలిపారు. థియేటర్ లలో 90 శాతం సినిమాల పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్నారని.. రెండ్ ఆర్ పర్సంటేజ్ విధానంలో ప్రదర్శిస్తున్న డిస్ట్రిబ్యూటర్లకు సమస్య ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విధానం తెలంగాణలోకి వస్తే 270 థియేటర్ లు మూత పడతాయని స్పష్టం చేశారు. అంతా తొందరగా సినీ పెద్దల పంచాయితీలు తేలేలా లేవని దిల్ రాజు అన్నారు.
ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో నిర్మాత బండ్ల గణేష్ ట్విటర్ లో ఒ పోస్ట్ పెట్టారు. అందులో 'ఆస్కార్ నటులు.. కమలహాసన్ లు ఎక్కువైపోయారు. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం' అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట హాల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్, ఆ పోస్ట్ దిల్ రాజు కోసం పెట్టడా అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.