ఆచార్య, భోళా శంకర్ వల్ల చిరు కొత్త సినిమాలకు ఇబ్బందులా.. అయ్యో పాపం!

Reddy P Rajasekhar
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య, భోళా శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు నిర్మాతలకు కమర్షియల్ గా భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ సినిమాల ఫలితాల వల్ల నిర్మాతలు కొత్త సినిమాలను నిర్మించే విషయంలో సైతం ఇబ్బందులు ఎదురయ్యాయనే సంగతి తెలిసిందే. ఆచార్య, భోళా శంకర్ సినిమాలు చిరంజీవికి దిమ్మతిరిగే షాకిచ్చాయి.
 
అయితే ఈ సినిమాల ప్రభావం చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభర సినిమాపై పడిందని తెలుస్తోంది. విశ్వంభర సినిమా ఓటీటీ హక్కుల విషయంలో మరీ భారీ ఆఫర్లు అయితే రావడం లేదని సమాచారం అందుతోంది. విశ్వంభర సినిమా రిలీజ్ కు సైతం ఇవే ఇబ్బందులు ఎదురవుతుతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా ఈ ఏడాది జులైలో విడుదలవుతుందనే సంగతి తెలిసిందే.
 
విశ్వంభర సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్లిడి వశిష్ట బింబిసార సినిమా తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి భారీ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండగా ఆయన రెమ్యునరేషన్ సైతం 70 నుంచి 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.
 
విశ్వంభర సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలీస్ందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సైతం ప్రేక్షకుల నుంచి మంచి రెసాన్స్ ను సొంతం చేసుకున్నాయి. విశ్వంభర సినిమా టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వంభర సినిమాకు సంబంధించి వరుస అప్ డేట్స్ వస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వంభర సినిమా ఇతర భాషల్లో సైతం అమేజింగ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. విశ్వంభర రికార్డులు తిరగరాయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తుండటం గమనార్హం.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: