గేమ్ ఛేంజర్ పైరసీ కుట్ర బట్టబయలు.. ఆ నిర్మాతే దిల్ రాజుపై పగతో ఇలా చేశాడా?

Reddy P Rajasekhar
టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలకు సంబంధించి ఏ వివాదం తలెత్తినా మొదట దిల్ రాజు పేరు వినిపిస్తుంది. నైజాంలో దిల్ రాజుకు కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నా నైజాం ఏరియాను శాసించే నిర్మాత దిల్ రాజు అని చాలామంది భావిస్తారు. థియేటర్ల బంద్ విషయంలో సైతం దిల్ రాజు పేరు బద్నాం కాగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి షాకింగ్ విషయాలు వెల్లడించడంతో పాటు గేమ్ ఛేంజర్ పైరసీ కుట్ర బట్టబయలు చేశారు.
 
ఇండస్ట్రీలో ఎవరి దారి వారిదేనని ఇక్కడ సమన్వయం లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికి తోచినట్టు వాళ్లు మాట్లాడుతున్నారని దిల్ రాజు కామెంట్లు చేశారు. తొలిరోజే గేమ్ ఛేంజర్ సినిమా పైరసీ జరిగిందని మా సినిమాను పైరసీ చేసిన వాళ్లలో మరో నిర్మాత కూడా ఉండవచ్చని దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో కొంతమంది నీచంగా ప్రవర్తిస్తున్నరని ఈ నిర్మాత అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
దిల్ రాజు తన కామెంట్లతో గేమ్ ఛేంజర్ పైరసీ కుట్ర బట్టబయలు చేశారు. ప్రముఖ నిర్మాత కావాలనే గేమ్ ఛేంజర్ సినిమాను టార్గెట్ చేశారని చెప్పకనే చెప్పేశారు. ఆ నిర్మాత ఎవరనే ప్రశ్నకు నెటిజన్లు ఇద్దరు ముగ్గురు ప్రముఖ నిర్మాతల పేర్లను కామెంట్లు చేస్తున్నారు. దిల్ రాజుపై పగతో మరీ ఇంతకు తెగించారా అంటూ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పవన్ సినిమా మే నెలలో రిలీజ్ అవుతుందని చెప్పారని ఆ తర్వాత రిలీజ్ డేట్ మార్చారని ఆయన అన్నారు. పవన్ సినిమాను ఆపే దమ్ము, ధైర్యం ఎవరూ చేయరని దిల్ రాజు పేర్కొన్నారు. టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలకు పవన్ పూర్తిస్థాయిలో మద్దతు తెలిపారని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరికి వారే సినిమాల గురించి అడుగుతున్నారని ఇండస్ట్రీలో యూనిటీ లేదని దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. దిల్ రాజు చెప్పిన విషయాలు సంచలనం అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: