1000 కోట్ల కలెక్షన్స్ పై మణిరత్నం సంచలన వ్యాఖ్యలు !
గత కొన్ని సంవత్సరాలుగా మణిరత్నం తీసిన సినిమాలు కలక్షన్స్ పరంగా భారీ విజయాన్ని అందుకోలేకపోతున్నాయి. అయితే ఈ విషయమై ఏమాత్రం నిరుత్సాహ పడకుండా మణిరత్నం భారీ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మిస్తూ తానే దర్శకత్వం వహిస్తూ ఈనాటి యంగ్ డైరెక్టర్స్ సవాల్ విసురుతున్నాడు.
ఈసినిమాను ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మణిరత్నం ను ఆ ఇంటర్వ్యూ చేస్తున్న మీడియా ప్రతినిధి మణిరత్నం కు ఊహించని ప్రశ్న వేశాడు. ఈసినిమా 1000 కోట్ల సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తుందా అంటూ అడిగిన ఒక ప్రశ్నకు ఈ విలక్షణ దర్శకుడు ఊహించని సమాధానం ఇచ్చాడు. తన దృష్టిలో మంచి సినిమా చెత్త సినిమా అన్న రెండు విభాగాలు ఉంటాయి కానీ 1000 కోట్ల సినిమా లేదంటే 500 కోట్ల సినిమా అన్న తేడాలు ఉండవని తన అభిప్రాయం అని మణిరత్నం కామెంట్స్ చేశాడు.
అంతేకాదు ఒక సినిమాను చూసిన తరువాత ఆసినిమాలోని పాత్రలను కథను ఎన్ని సంవత్సరాలు ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు అన్న విషయం తనకు ప్రాధాన్యత కానీ సినిమాల కలక్షన్స్ ను బట్టి సినిమాను అంచనావేయడం మంచిది కాదు అని అంటున్నాడు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సినిమా కలక్షన్స్ ను బట్టి సినిమా విజయాన్ని అంచనా వేస్తున్నారు. ఒక సినిమా కథలో అదేవిధంగా కధానంలో ఎన్నో కొత్త మార్గాలను దర్శకులు అన్వేషిస్తున్న పరిస్థితులలో దర్శకులు మూవీ ప్రాజెక్ట్ ను అత్యంత వేగవంతంగా పూర్తి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో మణిరత్నం తన వయస్సును లెక్క చేయకుండా ఈమూవీ తీసిన విషయం అందరికీ తెలిసిందే..