యాక్షన్ డ్రామాతో అదరగొట్టేసిన అడవి శేషు..డేకాయిట్ గ్లింప్స్ సూపర్..!

Divya
టాలీవుడ్ హీరో అడవి శేషు.. యాక్షన్ డ్రామా గా నటిస్తున్న తాజా చిత్రం డేకాయిట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది.అలాగే కీలకమైన పాత్రలో ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి అడవి శేషు కథా, స్క్రీన్ ప్లే అందిస్తూ ఉండగా అన్నపూర్ణ స్టూడియో సమర్పణలో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో పలు రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.



తాజాగా వాటన్నిటికీ క్లారిటీ ఇచ్చే విధంగా గ్లింప్స్ విడుదల చేసింది చిత్ర బృందం. ఏడాది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. గ్లింప్స్ విషయానికి వస్తే.. మృణాల్ ఎంట్రీ తో గ్లింప్స్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏ జూలియట్.. ఏం జరిగింది నీకు.. నీకు జరిగింది మామూలు విషయం కాదు.. నేను నిన్ను మోసం చేయడానికి  రాలేదు అంటూ అడవి శేషు చెప్పే డైలాగ్ తో ఎంట్రీ ఇస్తారు..  తర్వాత యాక్షన్ సీన్స్ ని యాడ్ చేసి మేకర్స్ సైతం సరికొత్తగా చూపించారు.


డేకాయిట్ సినిమాకి గ్లింప్స్ కి స్పెషల్ అట్రాక్షన్ గా యాక్షన్ సీన్స్ కనిపిస్తున్నాయి. మరొకసారి అడవి శేషు తన యాక్టింగ్ తో అదరగొట్టేసినట్లుగా కనిపిస్తోంది.. గూడచారి, మేజర్, ఎవరు వంటి చిత్రాలలో ఎలా నటించారో మళ్లీ అలాంటి పాత్రలోనే నటించినట్లుగా కనిపిస్తోంది. గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతున్నది. డేకాయిట్ సినిమా రిలీజ్ కి ముందే భారీ ధరకు ఆడియో హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సుమారుగా 8 కోట్లకు సోనీ సంస్థ కొనుగోలు చేసిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: