రష్మిక ఆ బాలీవుడ్ మూవీని రిజెక్ట్ చేసిందా.. పెద్ద మిస్టేక్ చేసిందిగా..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కన్నడ సినిమాల ద్వారా సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి అక్కడ కిరిక్ పార్టీ మూవీతో మంచి విజయాన్ని అందుకొని కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరుచుకుంది. ఆ తర్వాత ఈ బ్యూటీ ఛలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు వచ్చింది.


ఆ తర్వాత ఈమెకు క్రేజీ తెలుగు సినిమాల్లో అవకాశాలు లభించడం , అలాగే ఈమె నటించిన అనేక తెలుగు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం ఈమె అనేక భాషల సినిమాల్లో నటిస్తూ అద్భుతమైన జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ బ్యూటీ తన కెరీర్లో ఇప్పటివరకు చాలా సినిమాలను వదిలేసింది. కొంత కాలం క్రితం ఓ బాలీవుడ్ సినిమాను కూడా ఈ బ్యూటీ వదిలేసింది. బాలీవుడ్లో షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా జెర్సీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలుస్తుందే. ఈ మూవీ నాని , శ్రద్ధ శ్రీనాథ్ జంటగా రూపొందిన జెర్సీ అనే తెలుగు మూవీ కి రీమేక్ గా రూపొందింది.


హిందీ జెర్సీ మూవీలో మృనాల్ ఠాకూర్ స్థానంలో మొదట రష్మిక మందన ను హీరోయిన్గా అనుకున్నారట. కానీ ఈమె ఆ పాత్రను రిజెక్ట్ చేసిందట. జెర్సీ హిందీ వర్షన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోకపోయినా ఇందులో మృనాల్ పాత్రకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. దానితో చాలా మంది రష్మిక ఆ సినిమా చేసుకుంటే ఆమెకి కమర్షియల్ గా హిట్ దక్కకపోయినా నటిగా మంచి ప్రశంసలు అందేవి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm

సంబంధిత వార్తలు: