ఆశక్తి కరంగా మారిన శేఖర్ కమ్ముల ప్రయోగం !
‘నాదే నాదే నాదే’ అంటూ డబ్బు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు ఏదైనా చేస్తాడు అన్న స్టోరీ లైన్ ఈమూవీలో ఉండబోతోంది అన్న లీడ్ ఇస్తూ శేఖర్ కమ్ముల దేవీశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో డిజైన్ చేసిన ఈటీజర్ లో బాలీవుడ్ హాలీవుడ్ స్టైల్ మిక్స్ చేస్తూ చేసిన ప్రయోగం అత్యంత ఆసక్తికరంగా ఉండటంతో ఈటీజర్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఒక ప్రభుత్వ అధికారి ఒక బిచ్చగాడు ఒక పారిశ్రామిక వేత్త మధ్య జరిగే సంఘర్షణ వారు ముగ్గురు ఒకరికొకరు సంబంధంలేని జీవితాలలో ఉన్నప్పటికీ ఒక సంఘటన వారిలో ఉండే ఇగో ను ఎలా రెచ్చగొట్టింది అన్న సున్నిత అంశం చుట్టూ ఈమూవీ కథ ఉంటుంది అని అంటున్నారు.
బిచ్చగాడి పాత్రలో కనిపించే ధనుష్ పాత్రను వెనక ఉండి నడిపించే పాత్రలో నాగార్జున కనిపించబోతున్నాడు. ఈమూవీ కథను ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ తో ఈటీజర్ ను నడిపించడం ఒక సరికొత్త ప్రమోగం అనిపిస్తోంది. ఈమూవీకి మిగతా సినిమాల నుండి గట్టిపోటీ ఉంది.
‘కుబేర’ కు పోటీ పరంగా వారం ముందు పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ విడుదలకాబోతోంది. ఈసినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ‘కుబేర’ కు గట్టిపోటీ ఉంటుంది. ఈసినిమా విడుదలైన తరువాత మంచు విష్ణు ‘కన్నప్ప’ విడుదలకాబోతోంది. ప్రభాస్ అతిధి పాత్రలో నటించే ఈమూవీ పై కూడ అంచనాలు బాగానే ఉన్నాయి. ఎలా చూసుకున్నా ‘కుబేర’ కు గట్టిపోటీ కనపడుతోంది..