యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో సమంత , నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించగా ... కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే సమయానికి తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తుంది. కాజల్ అగర్వాల్ ఈ సినిమా ముందు ఏ మూవీ లో స్పెషల్ సాంగ్ చేయలేదు.
మొట్ట మొదటి సారి జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో ఈ స్పెషల్ సాంగ్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కి అద్భుతమైన గుర్తింపు వచ్చింది. ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ వచ్చిన ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతున్న కాజల్ ఇప్పటివరకు మరే సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు. ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే ... ప్రస్తుతం తారక్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ విషయంలో ప్రశాంత్ నీల్ , కూడా కొరటాల శివ ఫార్ములాను ఫాలో కాబోతున్నట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో రష్మిక మందన తో స్పెషల్ సాంగ్ చేయించాలి అనే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు , అందులో భాగంగా ఆమెతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది. కానీ ఇప్పటివరకు ఈ బ్యూటీ ఏ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు. మరి డ్రాగన్ సినిమాలో ఈ బ్యూటీతో స్పెషల్ సాంగ్ చేయించే విషయంలో నీల్ సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.