గొప్ప మనసు చాటుకున్న ప్రీతిజింతా.. ఖుషి లో ఫ్యాన్స్..!
అలా నిరంతరం సోషల్ మీడియాలో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే తాజాగా ప్రీతి జింతా చేసిన పనికి అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటున్నది. అసలు విషయంలోకి వెళ్తే సైనిక కుటుంబాల పట్ల తన బాధ్యతను మరొకసారి చాటుకున్నది ఈ ముద్దుగుమ్మ. సౌత్ వెస్ట్రన్ కమాండలో ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ కింద 1.10 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. జైపూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సౌత్ వెస్ట్రన్ ఆర్మీ కమాండర్ ఆధ్వర్యంలో ఆర్మీ కుటుంబాలకు విరాళంగా అందజేసింది ప్రీతి జింతా.
ముఖ్యంగా వారి యొక్క పిల్లల చదువు కోసం ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని కోరింది.. సైనికుల త్యాగాలను తాను వెలకట్టలేనని కానీ వారి కుటుంబానికి మాత్రం అండగా నిలుస్తూ ఉంటానని తెలియజేసింది ప్రీతి జింతా. అయితే ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్స్ ఎంతో సంపాదిస్తున్నప్పటికీ ఇలాంటి పనులు మాత్రం చేయడం చాలా అరుదు అని చెప్పవచ్చు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఒకసారి కూడా కప్పు గెలవలేని జట్టుగా పంజాబ్ కింగ్స్ కూడా ఉన్నది. ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత ప్లే ఆప్స్ లో అడుగు పెట్టబోతున్నది పంజాబ్..మరి మొదటి టైటిల్ ను గెల్చుకుంటారనే నమ్మకం అటు అభిమానులలో కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో మరో రెండు మూడు రోజులలో తేలిపోతుంది.