గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన అనగనగా డైరెక్టర్.. ఏకంగా ఆ రెండు క్రేజీ బ్యానర్లలో చాన్స్..?

Pulgam Srinivas
కొన్ని సంవత్సరాలు వెనక్కు వెళ్లినట్లయితే దర్శకులుగా సక్సెస్ అయి క్రేజీ బ్యానర్లు అవకాశాలను దక్కించుకోవడానికి దర్శకులకు అత్యంత ఎక్కువ సమయం పడుతుంది. అలాగే దర్శకులకు మంచి అవకాశాలు రావాలి అంటే వారు దర్శకత్వం వహించిన సినిమాలు థియేటర్లలో విడుదల అయ్యి అవి మంచి విజయాలను సాధిస్తేనే వారికి మంచి అవకాశాలు వచ్చేవి. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎవరైనా మంచి టాలెంట్ ఉంది డబ్బు తక్కువ ఉన్న , అలాగే సినిమాను రూపొందించాక ఆ సినిమాలను థియేటర్లలో విడుదల కాకపోయినా అవి ఏ యూట్యూబ్ లో విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన , అలాగే ఏ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి మంచి సక్సెస్ అయిన అలాంటి దర్శకులకు అద్భుతమైన అవకాశాలు దక్కుతున్నాయి.


ఇప్పటికే అలా యూట్యూబ్ వీడియోల ద్వారా ఓ టి టి ద్వారా సక్సెస్ అయిన ఎంతో మంది దర్శకులు ఉన్నారు. ఇకపోతే తాజాగా సన్నీ సంజయ్ అనే యువ దర్శకుడు సుమంత్ హీరోగా అనగనగా అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమా నేరుగా ఈటీవీ విన్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి సన్నీ సంజయ్ కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి.


ఇకపోతే ఈ యువ దర్శకుడు తాజాగా దర్శకత్వం వహించిన అనగనగా మూవీ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉండడంతో సన్నీ సంజయ్ కి ఏకంగా ఓ రెండు టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థల్లో సినిమా చేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థలు అయినటువంటి సితార ఎంటర్టైన్మెంట్ ,  మైత్రి మూవీ సంస్థలలో ఈ దర్శకుడికి సినిమాలు చేసే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: