ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సి పి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టికెట్ ధరలను చాలా తక్కువ చేసింది. అలాగే అదనపు షోలకు కూడా పెద్దగా పర్మిషన్లు ఇవ్వలేదు. దానితో ఎంతో మంది స్టార్ హీరోలు నటించిన సినిమాలను , భారీ బడ్జెట్ సినిమాలను అత్యంత తక్కువ ధరలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేయాల్సి వచ్చింది. దానితో అద్భుతమైన టాక్ వచ్చిన సినిమాలకు కూడా ఆ సమయంలో తక్కువ కలెక్షన్లు వచ్చాయి అని , అలాంటి సినిమాలకు మంచి టికెట్ ధరలు ఇచ్చి ఉంటే ఆ మూవీలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసేవి అని , భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలు , తక్కువ ధరలతో విడుదల చేయడం ద్వారా భారీ లాభాలను అందుకోవడం కష్టం అవుతుంది అని ఆ సమయంలో అనేక మంది నిర్మాతలు , డిస్ట్రిబ్యూటర్స్ , ఎగ్జిబిటర్స్ వాదనలను వినిపించారు. ఇకపోతే కొంత కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు.
దానితో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన కొంత మంది పెద్దలు పవన్ కళ్యాణ్ ను కలిసి వారి బాధలను విన్నవించారు. దానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విడుదల అయిన అనేక సినిమాలకు అద్భుతమైన టికెట్ ధరలను అందించారు. అలాగే ఎక్స్ట్రా షో స్ కి కూడా పర్మిషన్స్ ఇచ్చారు. ఇలా కూటమి ప్రభుత్వం సినీ పరిశ్రమ విషయంలో అత్యంత సానుకూలంగా ప్రవర్తించింది. కానీ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాను జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన సమయంలో థియేటర్లను బంద్ చేయాలి అనే ప్రతిపాదన బయటకు వచ్చింది.
దానితో ఇదంతా పవన్ కళ్యాణ్ పై కుట్ర అనే వాదనలు బయట గట్టిగా వినిపించాయి. ఈ వాదన గట్టిగా వైరల్ కావడం , పవన్ కూడా ఈ విషయంపై కాస్త సీరియస్ కావడంతో వెంటనే బంద్ విషయంలో తాత్కాలికంగా తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించిన పెద్దలు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తుంది. ఇకపోతే కూటమి ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ విషయంలో ఎంతో సానుకూలంగా ఉంటే ఎందుకు పవన్ సినిమా విడుదల సమయంలో ఇలాంటి సమస్యలను తెస్తున్నారు అనే వాదనను కొంత మంది వినిపిస్తున్నారు.