మంచోడిని కెలికితే ఇలానే ఉంటుంది.. పవన్ కామెంట్లపై ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..!!

Pandrala Sravanthi
ఏదైనా సరే కొద్దిరోజులు ఓపిక పడతారు. అది కోపం అయినా బాధైనా ఇంకేదైనా.. కానీ మరీ ఇబ్బంది పెడితే ఓపిక నశిస్తుంది.అది కోపం రూపంలో బయటికి వస్తుంది.తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే జరిగింది.. ఇన్ని రోజులు రాజకీయాలకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎప్పుడో ఓకే చేసిన సినిమాని విడుదల చేసుకుంటామంటే చివరికి ఆ సినిమాకి కూడా ఆటంకం కలిగేలా జూన్ 1 నుండి థియేటర్లు బంద్ అంటూ తన సినిమాకి ఆటంకం కలిగించారు.పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉండడంతో జూన్ 1 నుండి థియేటర్లు బంద్ అంటూ ప్రకటించడంతో డిప్యూటీ సీఎం ఓపిక నశించిపోయింది. వెంటనే ఆయన తన దైన శైలిలో ఒక ఘాటు లేఖని రివీల్ చేశారు. ఆ లేఖలో అందరి గురించి మాట్లాడారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయినా కూడా ఎందుకు తెలుగు సినిమా ఇండస్ట్రీలోని నిర్మాతలు కలవలేదు. 


అంత చులకన అయిపోయారా.. మీరు కలవకపోయినా మీ సినిమాలకు ఇండివిజువల్ గా వచ్చి ఎవరికి వారు టికెట్ రేట్లు పెంచమని ఆర్జి పెట్టుకుంటే మేము పెంచుతున్నాం. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతున్నాం.అయినా కూడా మమ్మల్ని చిన్నచూపు చూసి చులకన  చేస్తున్నారు.ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి టికెట్ రేట్ల గురించి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నిర్మాత వచ్చి కలవాలని చెప్పాము.కానీ ఎవరు కూడా నా మాట పట్టించుకోలేదు. మేము మీ సినిమాలకు మంచి గిఫ్ట్ ఇస్తే మీరు మాకు రిటర్న్ గిఫ్ట్ బాగానే ఇచ్చారు. మేం కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి వేచి చూస్తున్నాం.ఇప్పటినుండి ఎవరు ఇండివిజువల్ గా వచ్చి కలవకూడదు. ఎవరితో టికెట్ రేట్ల గురించి మాట్లాడేది లేదు. ఏదైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడానికి వీల్లేదు. ఇప్పటినుండి వ్యక్తిగత చర్చలు బంద్.. కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చింది.


కానీ సినిమా రంగం వాళ్ళు మాత్రం కూటమికి గట్టిగానే బుద్ధి చెప్పారు.. ఇకనుండి వ్యక్తిగతంగా మమ్మల్ని ఎవరూ కలవవద్దు. ఏదైనా సరే సంబంధిత విభాగాలకు చెందిన వారితోనే మాట్లాడతాం.అలాగే థియేటర్ లు కూడా థియేటర్ యజమానులు నడిపించడం లేదు. లీజుకి తీసుకున్న వాళ్లే నడిపిస్తున్నారు.థియేటర్ లపై ఆదాయం, వాళ్లు ఎన్ని టాక్స్లు కడుతున్నారు, థియేటర్లో అమ్మే ఫుడ్ ఇలా వాటన్నింటిపై లెక్కలు త్వరలోనే తీస్తాము.అంటూ పవన్ కళ్యాణ్ ఒక ఘాటు లేఖ రాశారు.అయితే ఈ లేఖ ప్రస్తుతం వైరల్ అవ్వడంతో చాలామంది పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులైతే మంచివాడిని కెలికితే ఆ తర్వాత పరిణామాలు ఇలాగే ఉంటాయి.ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ ఓపిక పట్టి సైలెంట్ గా ఉన్నాడు.కానీ ఆయన సినిమాకే ఎసరు పెడితే రియాక్షన్ ఎలా ఉంటుందో చూసారా..దెబ్బ అదుర్స్ కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: