ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప సిరీస్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో రష్మిక మందన హీరోయిన్గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ మూవీలను నిర్మించారు. ఇకపోతే పుష్ప సిరీస్ నుండి ఇప్పటివరకు రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ మూవీ రెండు భాగాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇక కలెక్షన్ల విషయానికి వస్తే పుష్ప పార్ట్ 1 తో పోలిస్తే పుష్ప పార్ట్ 2 కు అత్యంత భారీ కలెక్షన్లు వచ్చాయి. కానీ ఒక విషయంలో మాత్రం పుష్ప పార్ట్ 1 తో పోలిస్తే పుష్ప పార్ట్ 2 అత్యంత వెనుకబడిపోయింది.
అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? బుల్లి తెర ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకునే విషయంలో. పుష్ప పార్ట్ 1 సినిమా మొదటి సారి బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు తెలుగు వర్షన్ కు 22.54 టి ఆర్ పి రేటింగ్ దక్కగా , తమిళ్ వర్షన్ కు 10.95 , మలయాళ వెర్షన్ కి 10 , కన్నడ వర్షన్ కి 5.80 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. ఇకపోతే పుష్ప పార్ట్ 2 మూవీ కూడా కొన్ని రోజుల క్రితం తెలుగు , తమిళ్ , మలయాళ , కన్నడ భాషలలో బుల్లి తెరపై ప్రసారం అయింది. ఇకపోతే మొదటి సారి పుష్ప పార్ట్ 2 మూవీ బుల్లి తెరపై ప్రసారం అయినప్పుడు ఈ మూవీ తెలుగు వర్షన్ కు 12.61 టి ఆర్ పి రేటింగ్ దక్కింది. తమిళ్ వెర్షన్ కి 5.37 , మలయాళ వర్షన్ కు 7.05 , కన్నడ వర్షన్ కు 4.20 టి ఆర్ పి రేటింగ్ మాత్రమే దక్కింది.