పిల్లలపై అలాంటి కామెంట్స్ చేసిన హీరోయిన్ ఇలియానా..!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు హీరోయిన్ గా పేరు సంపాదించి తన అందంతో, నటనతో జీరో సైజ్ నడుముతో కుర్రాలను కట్టిపడేసింది హీరోయిన్ ఇలియానా. దాదాపుగా ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ లో ఎన్నో హిట్స్ అందుకున్న సమయంలో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యింది. మొదటిసారి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న యంగ్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించిన ఇలియానా తన వ్యక్తిగత కారణాలవల్ల ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. అధిక బరువు సమస్యల వల్ల కూడా ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి.


ఇలియానా తన జీవితంలో ఒక వ్యక్తిని ప్రేమించి ఆ తర్వాత బ్రేకప్ అయ్యి దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయి తిరిగి కోలుకోలేని పరిస్థితులలో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి రాణించలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించన ఇలియానా తాజాగా ఆమె పిల్లలపైన చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్  అయ్యి తల్లి కూడా అయ్యింది. ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు చూసి ఒక్కసారిగా అభిమానులు ఆశ్చర్యపోయారు. శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ముఖ్యంగా తన భర్త ఎవరనే విషయంపై చాలా సీక్రెట్ గా ఉంచింది ఇలియానా.


అయితే తాజాగా ఇలియానా తన పిల్లల గురించి మాట్లాడుతూ తన పిల్లలు తన ప్రేమను సంపాదించుకోవాలని తాను ఎప్పుడూ కూడా భావించలేదని..సంతోషంగా ,ఆరోగ్యకరంగా, మంచి దయగలిగిన పిల్లలను పెంచాలనుకుంటున్నాను అంటూ తెలియజేసింది. క్రూరంగా ,దయలేకుండా, స్వార్థపూరితంగా ఉండేలా పిల్లలను పెంచకూడదని తెలియజేసింది ఇలియానా.. పిల్లలకు ప్రేమను ప్రతిఫలంగా ఇవ్వకూడదు.. ఆనందం, గౌరవం లాగానే ప్రేమను సంపాదించుకోవాలని తెలియజేసింది ఇలియానా. ఇటీవలే ఇలియానా రెండోసారి కూడా తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించింది. ఇలాంటి సమయంలో ఇలియాన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: