కెరీర్లో మొట్టమొదటిసారి అంతమంది ముద్దుగుమ్మలతో బన్నీ..?

frame కెరీర్లో మొట్టమొదటిసారి అంతమంది ముద్దుగుమ్మలతో బన్నీ..?

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బన్నీ ఆఖరుగా పుష్ప పార్ట్ 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" మూవీ తర్వాత అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం వారు ఓ వీడియోని విడుదల చేశారు.


ఆ వీడియోకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో ద్వారా బన్నీ , అట్లీ కాంబోలో రాబోయే సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఉండబోతున్నట్లు క్లియర్గా అర్థం అవుతుంది. ఇది ఇలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించాడు. కానీ ఎప్పుడూ కూడా అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు కనిపించలేదు. కానీ ఈయన అట్లీ దర్శకత్వంలో నటించబోయే సినిమాలో అల్లు అర్జున్ తన కెరియర్ లో మొట్ట మొదటి సారి ముగ్గురు హీరోయిన్లతో ఆడి పాడబోతున్నట్లు తెలుస్తోంది.


ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడిగా నటించబోయే ముగ్గురు హీరోయిన్ల కోసం అట్లీ వెతుకులాటలో పడినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ కు అద్భుతమైన క్రేజ్ ఉండడం , అలాగే అట్లీ కి కూడా సూపర్ ఈమేజ్ ఉండడంతో ఈ మూవీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న ముగ్గురు హీరోయిన్లను తీసుకొని ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్లు అందుకు సంబంధించిన పనులు ప్రస్తుతం వేగవంతంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి బన్నీ , అట్లీ కాంబోలో తెరకెక్కకాబోయే సినిమాలో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: