అల్లు అర్జున్ రేంజ్ ప్రస్తుతం మారిపోయింది. ఆయన పుష్ప-2 సినిమాతో ప్రపంచాన్ని మెప్పు పొందడమే కాదు ఇండియాని షేక్ చేశాడు. ఒకరకంగా చెప్పుకోవాలంటే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఏకైక తెలుగు హీరోగా ఈయన పేరు తెచ్చుకున్నాడు. అయితే అలాంటి అల్లు అర్జున్ చేతిలో ప్రస్తుతం త్రివిక్రమ్,అట్లీ, సందీప్ రెడ్డి వంగా వంటి స్టార్ డైరెక్టర్ల సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం ఈ హీరో అట్లీ కాంబినేషన్లో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నారు. రీసెంట్ గానే ఆయన బర్త్డే సందర్భంగా సన్ పిక్చర్స్ బ్యానర్లో అట్లీ, అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అవ్వబోతుందని,అది ప్రపంచాన్ని షేక్ చేయబోతుంది అంటూ ఒక సర్ప్రైజింగ్ వీడియో కూడా రిలీజ్ చేశారు.దీంతో బన్నీ నెక్స్ట్ మూవీ అట్లీతోనే అని అందరికీ క్లారిటీ వచ్చింది.
ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో తన నెక్స్ట్ సినిమా చేస్తారు.ఆ తర్వాత పుష్ప-3 షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది.అయితే ఈ సినిమాల కారణంగా అల్లు అర్జున్ ఓ భారీ సినిమా ఆఫర్ నుండి పక్కకు తప్పుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు బన్నీ భారీ ప్రాజెక్టులో రామ్ చరణ్ చేరినట్టు కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ పుష్ప టు తర్వాత త్రివిక్రమ్, అట్లీలతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో సినిమా చేస్తారని రూమర్లు కూడా వినిపించాయి. అంతేకాదు రెండు సంవత్సరాల ముందు టి సిరీస్ వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ చేసింది.
కానీ ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. టి సిరీస్ అనౌన్స్ చేసిన సినిమా కోసం అల్లుఅర్జున్ ని పక్కన పెట్టి రాంచరణ్ ని తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. అలా అల్లు అర్జున్ తన సినిమాకు డేట్స్ ఇవ్వకపోవడం వల్లే సందీప్ రెడ్డి వంగా బన్నీని పక్కనపెట్టి రామ్ చరణ్ ని తన సినిమా కోసం తీసుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి టాలీవుడ్ ఇన్సైడ్ వర్గాల్లో వినిపించే రూమర్లలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సినీ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతుంది.