
కొరటాల శివ నెక్స్ట్ దారేటు .. ఎవరితో తర్వాత మూవీ..?
కానీ దేవర సినిమా తర్వాత కొరటాల ఎక్కడా కనిపించకుండా పోయారు .. ఇప్పటివరకు ఆయన నుంచి ఎలాంటి చిన్న అనౌన్స్మెంట్ రాలేదు .. ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని ఫ్యాన్స్ ముందు హామీ కూడా ఇచ్చారు . కానీ ఆ మూవీ మొదలు పెట్టడానికి ఎంత లేదన్న ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది .. ప్రస్తుతం వార్ 2 , ప్రశాంత్ నిల్ సినిమాల్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు .. ఇలా మరో రెండు సంవత్సరాలు దాకా ఎన్టీఆర్ కోసం కొరటాల ఆగుతాడా .. లేదంటే మరో హీరోను చూసుకుంటారు అనేది ఇంకా క్లారిటీ లేదు .. ప్రస్తుతం పెద్ద హీరోలు అందరూ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు .. ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి . అల్లు అర్జున్ అట్లీ కి ఓకే చెప్పాడు .. మహేష్ , రాజమౌళి చేతి లో ఉన్నాడు .
రామ్ చరణ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి .. అయితే ఇప్పటివరకు కేవలం స్టార్ హీరోలతోనే సినిమాల చేసుకుంటూ వస్తున్నాడు కొరటాల .. పోనీ టైర్ 2 హీరోలతో చేద్దామనుకుంటే .. నాని , విజయ్ దేవరకొండ , సాయిధరమ్ తేజ్ , రవితేజ లాంటి హీరోల చేతిలో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు . ఇక మరి కొరటాల దేవర 2 కోసం రెండేళ్లు ఎదురు చూస్తారా లేదంటే ఈ గ్యాప్ లో ఇంకో హీరో తో ఏమైనా సినిమా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది .. ఇక మొన్న దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి వచ్చాడు. ఆటైమ్‌లోనే ఎన్టీఆర్ నుంచి ఓ హామీ తీసుకున్నట్టు కూడా కొరటాల తెలుస్తుంది ..