వామ్మో: వేశ్య పాత్రలో నటించనున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే..?

frame వామ్మో: వేశ్య పాత్రలో నటించనున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరంటే..?

Divya
కొన్ని చిత్రాలలో నటించి ఆ తర్వాత కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. అలాంటి వారిలో బిందు మాధవి కూడా ఒకరు. ఎంతోమంది హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే ఫెడౌట్ అయింది. అయితే తాజాగా దండోరా సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మురళి కాంతు దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉండగా సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోందట.


25 రోజులపాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్ విలక్షణమైన పాత్రలో బిందు మాధవి నటించబోతోంది. ఇందులో ఈమె వేశ్యపాత్రలో కనిపించబోతున్నట్లు ఒక ఫోటోను కూడా షేర్ చేశారు. అయితే ఇది కూడా ఎమోషనల్ గా ఉండేలా ఉంటుందని ఈమె పాత్ర కూడా ఆలోచింపజేసేలా ఉంటుంది అంటు వార్తలు వినిపిస్తున్న ఇప్పటికే ఈ షెడ్యూల్ కి సంబంధించి యాక్టర్ శివాజీ కూడా నటించినట్లు తెలుస్తోంది. బిందు మాధవి ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కావడం చేత ఫస్ట్ బీట్ వీడియోతోనే అంచనాలను పెంచేసేలా కనిపిస్తోంది దండోరా.

సమాజంలో జరిగే ఎటువంటి కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారట. అగ్రవర్గాలకు చెందిన అమ్మాయిలను ప్రేమించి వివాహం చేసుకుంటే అగ్రవర్ణాలలో ఎదురు తిరిగితే ఎలాంటి సంఘటనలు ఎదురవుతాయని అంశం ఆధారంగా దండోరా చిత్రాన్ని తీస్తున్నారట. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రతి ఒక్కరు హృదయాలను హత్తుకునేలా భాగోద్వేగా సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.  ఇందులో శివాజీతో పాటుగా నవదీప్ ,బిందు మాధవి, రవికృష్ణ, అనూష తదితరులు కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బిందు మాధవి నటిస్తున్న సినిమా కావడం చేత ఈ సినిమా పైన కొంత మేరకు అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. మరి ఏ మేరకు దండోరా సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: