డిప్యూటీ సీఎం పవన్ కి బండ్ల గణేష్ థాంక్స్ .. కానీ ఎందుకు .. కారణం ఇదే..?

Amruth kumar
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు , రాజకీయాల్లో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న‌ ఎంతోమంది అభిమానులు మన తెలుగు సినిమా నుంచి కూడా కొందరు ఉన్నారు .. ఇక మరి అలాంటి వారిలో నిర్మాత నటుడు బండ్ల గణేష్ కూడా ఒకరు .. అయితే బండ్ల గణేష్ తో పవన్ గబ్బర్ సింగ్ , తీన్ మార్ సినిమాలు చేసిన విషయం అందరికీ తెలిసిందే .  అలాగే ఈ సినిమాల్లో గబ్బర్ సింగ్ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది ..

 

అయితే ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి ఆ కారణంగా థాంక్స్ చెప్పినట్టుగా పెట్టిన పోస్ట్ అభిమానుల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది .. అలాగే పవన్ కి ధన్యవాదాలు తెలుపుతూ తీన్ మార్ పోస్టర్ని బండ్ల గణేష్ సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది .. దీంతో బండ్ల గణేష్ ఎందుకు థాంక్స్ చెప్పినట్టు ? ఎందుకు ఈ పోస్టర్ పెట్టినట్టు అని అభిమానులు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు .. ఇక గత కొన్నాల నుంచి తీన్ మార్ రిలీజ్ కోసం గట్టిగా చర్చలు నడుస్తున్నాయి .. ఇక మరి దీన్ని బండ్ల గణేష్ మరోసారి ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సిద్ధం చేశారేమో అని చాలామంది భావిస్తున్నారు .. అలాగే దీనిపై ఏమన్నా ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి .


 అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం గబ్బర్ సింగ్ సినిమాను రిలీజ్ చేయాలని ఎంతగానో కోరుతున్నారు .   గత రెండు మూడు సంవత్సరాలుగా గబ్బర్ సింగ్ ను రీ రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ కూడా చేస్తున్నారు .. ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో మాత్రం బండ్ల ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు .. అయితే ఇప్పుడు డిజాస్టర్ గా నిలిచిన తీన్ మార్ ను రీ రిలీజ్ చేయటం పై మాత్రం అభిమానులు కొంత  అసంతృప్తిగా ఉన్నారు .. ఇక మరి అభిమానుల కోరిక మేరకు రాబోయే రోజులైనా  గబ్బర్ సింగ్ రీరిలీజ్ కు వస్తుందో లేదో చూడాలి ..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: