
హవ్వ.. ప్రభాస్ సిస్టర్ గా ఆ హీరోయిన్.. సందీప్ రెడ్డివంగా వావివరసలు మార్చేస్తున్నాడే..!
మనందరికీ తెలిసిందే వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకు ఛాన్స్ ఇచ్చాడు. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా పేరు "స్పిరిట్" . ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపించబోతున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా అలియా భట్ - నయనతార - త్రిష పేర్లు వినిపిస్తున్నాయి . ఇంకా ఫైనలైజ్ చేయలేదు . అయితే ఈ సినిమా పూర్తిగా సిస్టర్ సెంటిమెంట్గా తెరకెక్కుతుందట .
అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కి సిస్టర్ గా గా ఒక యంగ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసుకున్నాడట. ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీ లీల. ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శ్రీలీలను ఈ సినిమాలో ప్రభాస్ సిస్టర్ క్యారెక్టర్ లో చూపించాలి అనుకున్నారట. అయితే శ్రీలీల మాత్రం ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట . ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఎవరైనా హీరోయిన్గా నటించాలి అనుకుంటారు కానీ సిస్టర్ గా నటించాలి అనుకుంటారా..? నో వే అంటూ ఆమె సున్నితంగా రిజెక్ట్ చేసింది . మరొక హీరోయిన్ ని సెలెక్ట్ చేసే పనిలో బిజీ అయిపోయాడు సందీప్ రెడ్డివంగా . శ్రీలీల ఈ సినిమా రిజెక్ట్ చేసి మంచి పని చేసింది . లేకపోతే పూర్తిగా వావివరసలు మారిపోవు అంటూ ఫన్నీ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు జనాలు..!