తన కొడుకు పుట్టినరోజు ఇలా జరిగింది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!

frame తన కొడుకు పుట్టినరోజు ఇలా జరిగింది.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్..!

Divya
సినీ నటుడు ,జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు సింగపూర్ పాఠశాలలో చదువుతున్న చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదం వల్ల గాయాలైన సంగతి ఉదయం నుంచి వైరల్ గా మారుతున్నది. ఈ విషయం మీద అటు మెగా కుటుంబ సభ్యులు అభిమానులు కూడా కొంతమేరకు ఆందోళన పడుతున్నప్పటికీ చిరంజీవి సైతం ఎలాంటి ఇబ్బంది లేదంటూ తెలియజేశారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కొడుకు గురించి మాట్లాడడం జరిగింది.


స్కూల్ పిల్లలు సమ్మర్ క్యాంపుకు వెళ్ళగా అక్కడ జరిగిన ఈ ప్రమాదంలో తన కుమారుడికి గాయాలైనట్లుగా వెల్లడించారు. తన కుమారుడికి గాయాలైనట్టుగా తను అరకు పర్యటనలో ఉన్నప్పుడు ఉదయం 8:30 నిమిషాలకు తనకు ఫోన్ వచ్చిందని.. తన కుమారుడి చేతులు, కాళ్లకు కూడా గాయాలయ్యాయని ఊపిరితిత్తుల్లోకి పొగ కూడా చేరిందని అలాగే తన పక్కనే ఉన్న ఒక చిన్నారి కూడా మృతి చెందారని చెప్పడంతో చాలా బాధేసిందని తెలిపారు. సుమారుగా 30 మంది చిన్నారులు ఆ సమ్మర్ క్యాంపులో ఉన్నారని అలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని తెలిపారు పవన్ కళ్యాణ్.


అగ్ని ప్రమాదం చిన్నది అనుకున్నప్పటికీ దాని తీవ్రత మాత్రం చాలా పెద్దదని తెలిసింది.తన పెద్ద కుమారుడు అఖీరానందన్ పుట్టినరోజుని ఇలా తన రెండవ కుమారుడికి జరగడం చాలా బాధాకరంగా ఉందని వెల్లడించారు.వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని తెలిపారు. ఎక్కువగా పొగ పీల్చడం వల్లే దీర్ఘకాలంలో కూడా ఇది ఆరోగ్యం పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేశారు. ఈ ఘటన తెలిసినప్పటి నుంచి తన భార్య షాక్ లో ఉందని. ఈరోజు రాత్రి 9:30 నిమిషాలకు సింగపూర్ కి బయలుదేరుతున్నానని తెలియజేశారు పవన్ కళ్యాణ్. తన కుమారుడు కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రతి ఒక్కరికి కూడా మనసుతో అభినందనలు తెలుపుతున్నానని తెలిపారు. అలాగే ఈ ప్రమాదం తెలుసుకున్న తర్వాత ప్రధాని మోదీ కూడా ఫోన్ చేసి తన కుమారుడి ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: