నవీన్ అనగనగా ఒక రాజు మూవీ వెనక ఇంత స్టోరీ ఉందా ..?
చిత్ర పరిశ్రమ లో కొన్ని సినిమాలు అలా ఇలా తిరిగి ఎలా మారుతాయో ఎవరు ఊహించలేరు .. కథలు మరడమే కాదు కొన్ని సందర్భాల్లో చేతులు కూడా మారిపోతాయి .. అనగనగా ఒక రాజు కథ కూడా ఇలాంటి కొవలోకి వస్తుంది .. లెక్క ప్రకారం నవీన్ పోలిశెట్టి దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబినేషన్లో ఈ సినిమా రావాల్సి ఉంది .. అయితే సెకండ్ హాఫ్ నవీన్ కు అంతక నచ్చలేదు .. మార్చుదాం అనుకున్నాడు కళ్యాణ్ కుదరదు అన్నాడు అలా సమయం గడిచిపోయింది ..
ఇలా నిజానికి ఈ కథను త్రివిక్రమ్ ఆల్రెడీ ఫైన్ ట్యూన్ చేశారు .. దర్శకుడు తో ఒక రోజంతా కూర్చుని మార్పు చేర్పులన్నీ పూర్తి చేశారు కానీ నవీన్ కు నచ్చలేదు .. ఈ గ్యాప్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రిలీజ్ అవ్వటం ఆ తర్వాత నవీన్ కు యాక్సిడెంట్ అవ్వటం వంటివి చకచక జరిగిపోయాయి . అయితే యాక్సిడెంట్ టైం లో నవీన్ పోలిశెట్టి స్వయం గా ఈ కథపై కూర్చున్నాడు .. అలాగే కథ ను ఓన్ చేసుకుని తానే స్వయంగా పలు మార్పులు కూడా చేసుకున్నాడు ..
ఆ తర్వాత దర్శకుని కూడా తానే వెతికి పట్టుకున్నాడు పనిలో పని హీరోయిన్ కూడా మార్చేశాడు .. అలా కళ్యాణ్ శంకర్ చేయాల్సిన ఈ సినిమా మారి అనే మరో కొత్త దర్శకుడు చేతి లోకి వెళ్లిపోయింది .. ఇక మరో వైపు మ్యాడ్ సినిమా తో సూపర్ హిట్ కొట్టడం మ్యాడ్ స్కేర్ పనుల్లో పడిపోవటం తో కళ్యాణ్ కూడా ఈ కథ పై హక్కులు ఆశలను వదిలేసుకున్నాడు .. అలా అనగనగా ఒక రాజు సినిమా ను అన్ని తానే తన భుజాల మీద నడిపిస్తున్నాడు నవీన్ పోలిశెట్టి .