బాలయ్యతో సినిమా కోసం స్టార్ దర్శకులు .. కథల వడపాతలో నటసింహం బిజీబిజీ..!
ఇక ఈ సినిమా తో పాటు మరికొందరు దర్శకుల కథలు వినే పనిలో ఉన్నాడు బాలయ్య . ఇక దర్శకుడు హరీష్ శంకర్ , బాలయ్య కోసం ఒక కథను రెడీ చేస్తున్నారు .. ఒకటి రెండుసార్లు బాలయ్యతో మీటింగ్ కూడా జరిగాయి .. ఇక త్వరలోనే బాలయ్యకు పూర్తి నేరేషన్ ఇవ్వబోతున్నాడు అన్నీ కుదిరితే ఈ సినిమా కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి .. అలాగే మరో స్టార్ దర్శకుడు బాలయ్య తో వీర సింహారెడ్డి వంటి హిట్ సినిమా తీసిన గోపీచంద్ మలినేని కూడా ఈ మధ్య బాలయ్యకు మరో కథ చెప్పారు ..
ఇక ఆ కథకు బాలయ్య ఓకే చెప్పినట్టు కూడా తెలుస్తుంది .. ఇక ప్రస్తుతం ఈ దర్శకుడు బాలీవుడ్లో జాట్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నాడు . ఈ హడావుడి ముగిసిన తర్వాత బాలయ్య సినిమా అనౌన్స్ చేసే అవకాశం ఉంటుంది .. అలాగే ఓ తమిళ దర్శకుడు సినిమాలో కూడా బాలయ్య ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు .. ఇలా ఇవి కాకుండా మరో ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు విన్న బాలయ్య ఇంకా వీటికి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు .