రాజ్యం బాగుండాలంటే రాజు ఎలా అయితే బాగుండాలో.. దేశం అభివృద్ధి చెందాలంటే రాజకీయ నాయకులు ఎలా అయితే మంచివారై ఉండాలో.. ఒక టీవీ ఛానల్ నడవాలంటే కూడా అందులో పనిచేసే యాంకర్లు కూడా బాగుండాలి.యాంకర్ల మాట తీరు వల్లే ఛానల్ కి మంచి పేరు వస్తుంది.అలా ఇప్పుడు ఉన్న టీవీ ఛానల్స్ లో ఎంతో మంచి రిపోర్టర్లు, న్యూస్ రీడర్లు ఉన్నారు. అయితే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి సంబంధించి ఏదో ఒక ఛానల్ అనేది సొంతంగా ఉంటుంది. ఆ ఛానల్లో కేవలం ఆ రాజకీయ నాయకుడిని పొగుడుతూ మిగిలిన పార్టీలను విమర్శిస్తూ ఉంటారు. అలా ఏపీలో టీడీపీకి సపోర్టుగా ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ గా సాక్షి ఛానల్ మాత్రమే ఉంది.. ఇక ఈ సాక్షి ఛానల్ లో యాంకర్ ఈశ్వర్ కి ఎంతో మంచి గుర్తింపు ఉంది.
ఈయన సాక్షి ఛానల్ లో చాలా రోజుల నుండి కొనసాగుతూ తన గంభీరమైన గొంతుతో తనదైన స్టైల్ లో వార్తలు చదువుతూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే అలాంటి యాంకర్ ఈశ్వర్ సాక్షి ఛానల్ కి రిజైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఉన్నట్టుండి గత యాంకర్ ఈశ్వర్ టీవీ ఛానల్ లో కనిపించకపోవడమే. గత కొద్ది సంవత్సరాలుగా సాక్షి టీవీ ఛానల్ లో ఎన్నో కీలకమైన డిబేట్లు పెట్టడంతో పాటు ప్రైమ్ టైం న్యూస్ బులిటెన్స్ లో కీలకంగా ఉన్న ఈశ్వర్ సడన్ గా సాక్షి టీవీ స్క్రీన్ పై కనిపించడం లేదు. సాక్షి టీవీలో ఈశ్వర్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో చాలా రకాల అనుమానాలు లేవనెత్తుతున్నారు నెటిజన్స్.
ఈశ్వర్ సాక్షి టీవీకి రాజీనామా చేసి వేరే ఛానల్ లోకి వెళ్లాడని,వేరే ఛానల్ లో భారీ ఆఫర్ చేయడంతో సాక్షి టీవీని వదిలేసి వేరే ఛానల్ లోకి జంప్ అయ్యాడని అంటుంటే మరికొంతమందేమో వ్యక్తిగత కారణాలవల్లే ఈశ్వర్ సాక్షి టీవీకి రాజీనామా చేశారని మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సాక్షి టీవీలో యాంకర్ ఈశ్వర్ మిస్ అవ్వడంతో సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వైరల్ న్యూస్ పై ఇప్పటివరకు ఈశ్వర్ గానీ సాక్షి టీవీ గానీ స్పందించలేదు. అయితే మీడియా రంగంలో ఉన్న చాలా మంది యాంకర్లు వేరే ఛానల్ ఆఫర్ నచ్చితే ఆ ఛానల్ లోకి జంప్ అవుతూ ఉంటారు. మరికొంతమందేమో సొంతంగా చానల్స్ పెడుతూ ఉంటారు. మరి యాంకర్ ఈశ్వర్ వేరే ఛానల్ ఏమైనా పెట్టారా.. లేక వేరే టీవీ ఛానల్ లోకి జంప్ అయ్యారా అనేది తెలియాల్సి ఉంది.