ఓటీటీలోకి వచ్చేస్తున్న.. రూ.50 కోట్ల మూవీ..!

frame ఓటీటీలోకి వచ్చేస్తున్న.. రూ.50 కోట్ల మూవీ..!

Divya
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్ పైన నిర్మించిన తాజా చిత్రం కోర్ట్. డైరెక్టర్ రామ్ జగదీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ప్రియదర్శి కీలకమైన పాత్రలో నటించగా శివాజీ, రోహిణి, సాయికుమార్, శ్రీదేవి వంటి నటీనటుల సైతం అద్భుతంగా నటించారు. గత ఏడాది మార్చి 14న గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయడం జరిగింది. ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి చిన్న సినిమాలలోనే భారీగా లాభాలను తెచ్చిపెట్టిన చిత్రంగా పేరు సంపాదించింది.


కోర్ట్ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటిలో వస్తుందా అని అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఓటిటి ప్రియులకు తాజాగా గుడ్ న్యూస్ తెలియజేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11వ తేదీన ప్రముఖ ఓటీటి ప్లాట్ఫారంలో ఒకటైన  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్మింగ్ కావడానికి సిద్ధమవుతున్నది.తాజాగా ఈ విషయాన్ని నెట్ ఫిక్స్ అధికారికంగా తెలియజేసినట్లు తెలుస్తోంది. కోర్ట్ సినిమా తెలుగులోనే విడుదలై మంచి విజయాన్ని అందుకున్నది.


కానీ ఓటిటి ప్రియులకు మాత్రం మరింత గుడ్ న్యూస్ తెలియజేస్తూ ఈ సినిమాని ఐదు భాషలలో తీసుకువచ్చేలా ప్లాన్ చేశారు. హిందీ ,తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలో కూడా స్ట్రిమింగ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి  ఈ విషయంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. కథల ఎంపిక విషయంలో నిర్మాతగా నాని విభిన్నంగా ఆలోచిస్తూ సమాజానికి ఏదో ఒక విధమైనటువంటి సందేశాన్ని సైతం ఇచ్చేలా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాని పారడైజ్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా కథ కూడా చాలా విభిన్నంగా కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ని రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: