ప్రభాస్ స్పిరిట్ ఇలా ఉండ‌బోతుంది .. డైరెక్టర్ సందీప్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Amruth kumar
ప్రజెంట్ పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్ హీరోగా పలు భారీ సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న వ‌రుస పాన్ ఇండియా సినిమాలు షూటింగుల్లో బిజీగా ఉన్నాడు .. వీటిలో రాజా సాబ్‌ షూటింగ్ చివరి దశకు వచ్చింది .. అలాగే హను రాఘవపూడి తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా ఎంతో శరవేగంగా జరుగుతుంది .. ఈ సినిమాల తో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ సినిమా పై మాత్రం  ఊహించని అంచనాలు మాత్రం నెలకొన్నాయి ..


ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవకపోయినా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి .  అలాగే ఈ క్రేజీ కాంబో పై అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .  ఇక ఈ సినిమాను పోలీస్ యాక్షన్ డ్రామాగా అభిమానులకు చూపించబోతున్నారు .. ఇక ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమాపై ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వస్తుంది .. రీసెంట్ గానే ఈ సినిమాని మెక్సికోలో స్టార్ట్ చేసినట్లుగా చెప్పుకొచ్చాడు దర్శకుడు సందీప్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డే బయటికి ఇచ్చారు .. ఇక స్పిరిట్ సినిమా ఆసక్తికరంగా ఉత్కంఠ భరితంగా సాగే సబ్జెక్టు అని సందీప్ కన్ఫర్మ్ చేశాడు ..


 ఇక దీంతో ఇన్ని రోజులు సాలిడ్ యాక్షన్ సబ్జెక్టు మాత్రమే అనుకున్న వారికి ఇప్పుడు ఇది ఒక థ్రిల్లర్ టైప్ సినిమా అని కూడా తాను తీస్తున్నారని చెప్పవచ్చు .. ఇక మరి స్పిరిట్ సినిమా సందీప్ , ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కని రేంజ్ లో ఉంది .. ఇప్పటికే ప్రభాస్ ఖాతాలో రెండు 1000కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సినిమాలు ఉన్నాయి .. 500 కోట్లు అందుకున్న‌ సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి .. మరి ఈ స్పిరిట్ సినిమా మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని కలెక్షన్లు రాబడుతుంది అని చెప్పటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: