సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు అనే విషయం కామన్ అయిపోయింది. ఇదే తరుణంలో పెళ్లికి ముందే లవ్ లో పడి వారితో అన్ని పనులు కానీచ్చేసి చివరికి ప్రెగ్నెంట్ అయిన సందర్భాలు కూడా అనేకం వినిపిస్తున్నాయి. అలా కొంతమంది హీరోలు పెళ్లికి ముందు ఎఫైర్లు పెట్టుకొని చివరికి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తీరా ప్రెగ్నెంట్ అయిన తర్వాత మొహం చాటేసిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఒక హీరోయిన్ పరిస్థితి కూడా అలాగే తయారైందట.. ఒక బడా హీరో హీరోయిన్ ప్రేమ పేరుతో నమ్మించారట. అందరూ కలిసి చట్టపట్టలేసుకొని తిరగడం మొదలుపెట్టారు. ఆ హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఆయనతో అన్ని విధాలుగా ఏది అడిగినా చేసింది.
చివరికి ఇద్దరు కలిసి చీకటి రహస్యాలు కూడా నడిపించడంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అయింది. తీరా ఆమె పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టగా ఆ స్టార్ హీరో వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారట. తనతో సంబంధం లేదని చెప్పడానికి తనకు రెండు కోట్లు ఇస్తానని కూడా ఆఫర్ చేసినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఒకవేళ బయటకు వచ్చి ఆ హీరో వల్లే నేను ప్రెగ్నెంట్ అయ్యానని చెబితే ఆ కుటుంబం పరువు మొత్తం పోతుందని ఆ హీరో భయపడుతున్నారట.
దీంతో ఆమె రెండు కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకొని ప్రెగ్నెంట్ తీయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నెట్టింటా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ హీరోయిన్ మాత్రం నేను అస్సలు తీయించుకోను నేను పెళ్లి చేసుకుంటానని పట్టు పట్టిందట.. మరి ఆ హీరో హీరోయిన్ ఎవరనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు కానీ ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి చూడాలి ఈ తతంగం చివరికి బయటకు వస్తుందా లేదంటే లోలోపలే ముగిసిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.