ఏపీలో మరో కొత్త మల్టీఫ్లెక్స్... అల్లు అరవింద్ కొత్త థియేటర్ ఎక్కడంటే.. !
తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్‌ల విస్తరణ దూకుడుగా సాగుతోంది. టాలీవుడ్ టాప్ హీరోలు, నిర్మాతలు థియేటర్ల విస్తరణ పై బాగా కాన్ సంట్రేషన్ చేస్తున్నారు. ఒక్కొక్కరు మెల్లగా మల్టీపెక్స్ బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు ఇప్పటికే తమ బ్రాండ్ పేరుతో మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ఏషియన్ సినిమాస్ , యు.వి క్రియేషన్స్ , వీ సెల్యూలాయిడ్స్ , సురేష్ ప్రొడక్షన్స్ , మైత్రీ మూవీ మేకర్స్ తదితర సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లను విజయవంతంగా రన్ చేస్తున్నాయి. ఆసియన్ సురేష్ ఒక అడుగు ముందుకు వేసి టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు .. మిడ్ రేంజ్ హీరోలతో కలిసి భాగస్వామ్యంతో మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, బన్నీ , విజయ్ దేవరకొండ తో మల్టీఫ్లెక్స్‌లు ఏర్పాటు చేసిన ఈ సంస్థ చెన్నైలో శివ కార్తీకేయన్‌తో కలిసి .. బెంగళూరులో మహేష్‌తో కలిసి మరో మల్టీఫ్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. అటు రవితేజతోనూ మరో మాల్ ఏర్పాటు చేసే ప్లాన్‌లో ఉంది.
ఇదిలా ఉంటే ఇప్పటికే భీమవరంలో గీతా మల్టీప్లెక్స్ పేరుతో ఓ మల్టీఫ్లెక్స్ నడుపుతున్న గీతా ఆర్ట్స్ సంస్థ మరో మల్టీప్లెక్స్ ప్రారంభించింది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి విడిపోయిన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఏర్పాటు చేసిన గీతా మల్టీప్లెక్స్ మార్చి 28న గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. ఇది మూడు స్క్రీన్ లతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ మార్కెట్లో ప్రీమియం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది. ఇందులో అత్యాధునిక 4కె డాల్బీ ఆప్టిమైజ్డ్ అట్మాస్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. ఈ మల్టీప్లెక్స్ కాసు సెంట్రల్ మాల్‌లో ఏర్పాటు చేయడం విశేషం. ఇది మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఫ్యామిలీకి చెందింది. ఈ మూడు స్క్రీన్లలో సిట్టింగ్ కెపాసిటీ 220 - 250 - 260 గా ఉండనుంది.