"రాబిన్ హుడ్ "కి "మహేష్"కి ఉన్న సంబంధం ఏంటి.. నిర్మాత ఎందుకలా అన్నాడు..?

frame "రాబిన్ హుడ్ "కి "మహేష్"కి ఉన్న సంబంధం ఏంటి.. నిర్మాత ఎందుకలా అన్నాడు..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి మైత్రి సంస్థ వారు తాజాగా రాబిన్ హుడ్ అనే మూవీ ని నిర్మించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నితిన్ హీరోగా నటించగా ...శ్రీ లీల హీరోయిన్గా నటించింది. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ లో రాజేంద్రప్రసాద్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనుండగా .... ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఓ చిన్న క్యామియో పాత్రలో కనిపించబోతున్నాడు.


ఈ మూవీ ని మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న ఈ మూవీ బృందం వారు ఓ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. దానితో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి తాజాగా ఈ మూవీ నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ ఈ సినిమా గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు అనేది తెలుసుకుందాం. అసలు విషయం లోకి వెళితే ... రాబిన్ హుడ్ సినిమా అద్భుతంగా ఉండబోతుంది. ప్రేక్షకులందరికీ ఆకట్టుకోబోతుంది. ఇలాంటి సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు "దూకుడు" అనే సినిమాలో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.


ఆ సినిమాలో ఒక మంచి ఎమోషనల్ పాయింట్ ఉంటుంది. అలాగే ఒక మంచి కామెడీ తో సినిమా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక రాబిన్ హుడ్ సినిమా కూడా దూకుడు మూవీ మాదిరి ముందుకు సాగుతుంది. అదే రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అని రాబిన్ హుడ్ సినిమా నిర్మాతలలో ఒకరు అయినటువంటి రవి శంకర్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: