
మహేష్ , రాజమౌళి సినిమాలో ఇది నిజంగా షాకింగ్ .. ఏం దెబ్బ కొట్టాడు..?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఓ భారీ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర కోసం బాలీవుడ్ నుంచి యమాలీవుడ్ వరకు చాలామంది ఆర్టిస్టుల్ని సంప్రదించినట్టు గతం లో ఎన్నో వార్తలు వచ్చాయి .. ఇదే క్రమం లో ప్రధానంగా జాన్ అబ్రహం పేరు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు గాసిప్స్ కూడా వచ్చాయి . ఇదే క్రమంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు ఫైనలైజ్ చేయటం ఆయన సెట్స్ లో ప్రత్యక్షమవడం అన్నిచక జరిగిపోయాయి . అయితే ఇప్పుడు ఈ ఊహగానాలని కథనాలని పరోక్షంగా తిప్పికొట్టాడు పృథ్విరాజ్ .. మహేష్ , రాజమౌళి సినిమాలో తాను దాదాపు సంవత్సరం నుంచి కొనసాగుతున్నట్టు ప్రకటించాడు ..
ఇంకా చెప్పాలంటే సంవత్సరం కంటే కాస్త ఎక్కువ సమయాన్ని మహేష్ , రాజమౌళి సినిమా కోసం తాను కేటాయించానని అంటున్నాడు . ప్రీ ప్రొడక్షన్ వర్క్ నుంచి తను ఈ ప్రాజెక్టు లో ఉన్నాన ని కాకపోతే కొన్ని నిబంధనల వల్ల ఈ విషయాన్ని తాను బయటకు చెప్పలేదని కూడా తెలిపాడు .. ఎప్పుడైతే ఒరిస్సా లోని కోరాపూట్ షూట్ లో మహేష్ తో కలిసి ఉన్న తన ఫోటో లు , వీడియో లు బయటి కి వచ్చాయో.. ఇక దీన్ని దాచి పెట్టడాని కి లేకుండా పోయింద ని అంటున్నాడు పృథ్వీరాజ్ .. అలాగే త్వరలో నే మహేష్ , రాజమౌళి తో తాను కూడా కలిసి మీడియా ముందుకు రాబోతున్నట్లు కూడా ప్రకటించాడు ఈ స్టార్ హీరో . ఈ సినిమా షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుంది .. ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమా లో హీరోయిన్ గా నటిస్తుంది .