
చూడ్డానికి సన్నగాన్నా .. ఈ టాలీవుడ్ బ్యూటీ కరాటీలో బ్లాక్ బెల్ట్ ఎవరంటే..?
ఇలా అని చదువు ని ఏమాత్రం ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు .. గత ఏడాది ఇంటర్మీడియట్ను కంప్లీట్ చేసింది . ప్రస్తుతం తన ఉన్నత చదువులు కోసం సిద్ధమవుతుంది .. ఇదే క్రమంలో వరుస సినిమాలు తో కూడా బిజీ అవుతుంది . ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో నటించింది ఒకే ఒక సినిమా .. అయితే నేమ్ తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది . అయితే ఇప్పుడు ఇదే సినిమాకి సీక్వెల్ గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. చూడడానికి ఎంతో సన్నగా నాజూగ్గా కనిపించిన ఎంతో క్యూట్ గా ఉండే ఈ హీరోయిన్ మరెవరో కాదు .. మ్యాడ్ మూవీ హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ . ఇక త్వరలోనే మ్యాడ్ 2 కూడా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సమయంలో .. ఈ హీరోయిన్ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి .. ఇందులో చాలామందికి ఈ విషయాలు ఒక్కటి కూడా తెలియవు .
కేరళలోని త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన అనంతిక .. ది మ్యాడ్ తొలి సినిమా అని అంత అనుకుంటారు కానీ దీనికన్నా ముందే ఈమె 2022 లో రాజమండ్రి రోజ్ మిల్క్ అనే సినిమాలో నటించింది .. ఈ సినిమాలో కీర్తి అనే ఓ కాలేజీ అమ్మాయిగా నటించింది అనంతిక .. తర్వాత 2023 లో మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది . అలాగే రజినీకాంత్ లాల్ సలాం లోను ఓ ప్రత్యేక పాత్రలో కనిపించింది .. అదే విధంగా రైడ్ అనే ఓ తమిళ సినిమాలో కూడా ఈమె మెరిసింది . అయితే ఇప్పుడు త్వరలోనే మ్యాడ్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధంగా ఉంది .. ఇక ఈ సినిమా మార్చ్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది .. వీటితో పాటు 8 వసంతాలు అనే సినిమాలో కూడా అనంతిక హీరోయిన్గా నటిస్తుంది .