నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ మధ్య కాలంలో వరస పెట్టి బ్లాక్ బస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. అఖండ మూవీ కంటే ముందు వరస అపజయాలను ఎదుర్కొంటూ వచ్చిన బాలయ్య "అఖండ" మూవీ తర్వాత నుండి అద్భుతమైన విజయాలను అందుకుంటున్నాడు. అఖండ మూవీతో సూపర్ సక్సెస్ను అందుకున్న బాలయ్య ఆ తర్వాత వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా బాలయ్య నాలుగు విజయాలను అందుకున్నాడు.
ఇక ప్రస్తుతం బాలయ్య , బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ కి కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ తదుపరి మూవీ కి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ తన తదుపరి మూవీ ని కె వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యానర్ వారు బాలకృష్ణ హీరోగా రూపొందబోయే సినిమాకు హరీష్ శంకర్ ను దర్శకుడిగా ఎంపిక చేసుకున్నట్లు , ప్రస్తుతం హరీష్ శంకర్ కూడా బాలకృష్ణ కోసం ఒక కథను రెడీ చేస్తున్నట్లు , ఆ కథ పూర్తి కాగానే బాలకృష్ణకు దానిని వినిపించనున్నట్లు తెలుస్తోంది.
ఒక వేళ బాలకృష్ణ కు హరీష్ శంకర్ చెప్పిన కథ గనుక నచ్చినట్లయితే బాలకృష్ణ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో కే వీ ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం హరీష్ శంకర్ , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక వేళ బాలయ్య , హరీష్ శంకర్ కాంబోలో మూవీ సెట్ అయినట్లయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.