ప్రభాస్ - సందీప్ మూవీ షూటింగ్ మొదలయ్యేది ఆరోజే..!

frame ప్రభాస్ - సందీప్ మూవీ షూటింగ్ మొదలయ్యేది ఆరోజే..!

Divya
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోస్ట్ వెయిటెడ్  సినిమాలలో ప్రభాస్ - సందీప్ రెడ్డివంగా కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ కూడా ఒకటి.ఇప్పటికే రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న సందీప్ డైరెక్షన్లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అని అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించారు తప్ప ఇప్పటివరకు ఈ సినిమా మొదలు కాలేదు. ఇంకా ఎప్పుడు మొదలవుతుందని అభిమానులు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం త్వరలోనే ఈ మూవీకి సంబంధించి లాంఛనంగా అప్డేట్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
త్వరలోనే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉగాది పర్వదినాన ఈ సినిమాను లాంచనంగా మొదలుపెట్టబోతున్నారు. ఆరోజు అయితే అన్ని విధాలుగా బాగుంటుంది అని చిత్ర బృందం కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక రెగ్యులర్ షూటింగ్ కి ఇంకా టైం పడుతుందని,  ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజా సాబ్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది చివరికల్లా ఫ్రీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచే స్పిరిట్ మూవీను స్టార్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సినిమాలో ప్రభాస్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ఇక స్పిరిట్ సినిమాలో మొదటిసారి పోలీస్ గా నటించబోతున్నాడు అని తెలిసి అభిమానులలో అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించడం అంటే మామూలు విషయం కాదు అని,  పాత్ర అదిరిపోతుందని కూడా కామెంట్లు చేస్తున్నారు  నెటిజన్స్. మరి ఏ మేరకు ఈ సినిమా వర్కౌట్ అవుతుందో చూడాలి. ఇంకా ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. సలార్ 2, కల్కి2  చిత్రాలలో కూడా నటించాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే యేడాది ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: