మొదలైన మ్యాడ్ స్క్వేర్ హంగామా.. అక్కడ సక్సెస్ అయితే భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..?

frame మొదలైన మ్యాడ్ స్క్వేర్ హంగామా.. అక్కడ సక్సెస్ అయితే భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ..?

Pulgam Srinivas
కొంత కాలం క్రితం మ్యాడ్ అనే సినిమా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించిన కొంత కాలానికి ఈ మూవీ కి కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ అనే సినిమాని రూపొందించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలా ప్రకటించడంతోనే ఆ మూవీ పై అంచనాలు పెరిగి పోయాయి. ఇకపోతే మ్యాడ్ స్క్వేర్ మూవీ ని మార్చి 28వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

గత కొన్ని రోజులుగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను భారీ స్థాయిలో నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఇప్పటికే మ్యాడ్ మూవీ మంచి విజయం సాధించి ఉండడంతో మ్యాడ్ స్క్వేర్ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే మ్యాడ్ స్క్వేర్ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా బాగుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగాయి.

ఇక ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న అంచనాల రిత్యా ఈ మూవీ బుక్ టికెట్ బుకింగ్స్ కి మంచి రెస్పాన్స్ లభించే అవకాశం ఉంది అని చాలా మంది భావిస్తున్నారు. అదే విధంగా ఈ మూవీ టికెట్ బుకింగ్స్ కు మంచి రెస్పాన్స్ కనక ప్రేక్షకుల నుండి లభించినట్లయితే మొదటి రోజు ఈ మూవీ కి మంచి ఓపెనింగ్స్ లభించే అవకాశం ఉంటుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: