కమెడియన్ గా కెరియర్ను మొదలు పెట్టి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను కొనసాగిస్తున్న నటలలో ఒకరు అయినటువంటి ప్రియదర్శి తాజాగా కోర్టు అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. నాచురల్ స్టార్ నాని ఈ మూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని మార్చి 14 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ అయింది. మరి ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ మూవీ కి 7 రోజుల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 7.05 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 97 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 5.55 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 7 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.57 కోట్ల షేర్ ... 22.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే 7 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.50 కోట్ల కలెక్షన్లు దక్కగా ... ఓవర్సీస్ లో 4.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 19.32 కోట్ల షేర్ ... 36.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఈ మూవీ దాదాపు 7 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 12.32 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే స్టార్ హీరోల సినిమాలకు భారీ కలెక్షన్లు వచ్చిన ఆ మూవీలకు పెద్ద స్థాయిలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగే అవకాశాలు ఉండడంతో ఆ మూవీల ద్వారా డిస్ట్రిబ్యూటర్లకు భారీ ఎత్తున లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉంటాయి. కానీ కోర్టు మూవీ కి తక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ద్వారా బయ్యర్లకు భారీ ఎత్తున లాభాలు దక్కుతున్నట్లు తెలుస్తోంది.