రీ రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్లను చేసిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే..?

frame రీ రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్లను చేసిన టాప్ 5 తెలుగు మూవీస్ ఇవే..?

Pulgam Srinivas
రీ రిలీజ్ లో భాగంగా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 తెలుగు మూవీలు ఏవో తెలుసుకుందాం.

మురారి : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సోనాలి బింద్రే హీరోయిన్గా కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో బాగంగా ఈ సినిమా ఏకంగా 8.90 కోట్ల కలక్షన్లను వసూలు చేసి తెలుగులో అత్యధిక కలెక్షన్లను రీ రిలీజ్ లో బాగంగా వసూలు చేసిన సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.

గబ్బర్ సింగ్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా 8.01 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది.

ఖుషి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భూమిక హీరోయిన్గా ఎస్ జె సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా 7.46 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన తెలుగు సినిమాల లిస్టులో ఈ మూవీ మూడవ స్థానంలో నిలిచింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : విక్టరీ వెంకటేష్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా అంజలి , సమంత హీరోయిన్లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే రీ రిలీజ్ అయింది. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమా 6.60 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి రీ రిలీస్ లో అత్యధిక కలెక్షన్స్ చేసిన తెలుగు సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో నిలిచింది.

బిజినెస్ మాన్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భాగంగా 5.85 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: