శ్రీదేవిని పెళ్లి చేసుకోనని మొహం మీదే చెప్పిన టాలీవుడ్ నిర్మాత.?

frame శ్రీదేవిని పెళ్లి చేసుకోనని మొహం మీదే చెప్పిన టాలీవుడ్ నిర్మాత.?

Pandrala Sravanthi
టాలీవుడ్ హీరోయిన్ గా తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టి తమిళ, కన్నడ సినిమాల్లో కూడా రాణించి చివరికి హిందీలో అడుగుపెట్టి బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ అయ్యింది శ్రీదేవి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులు పడింది.ముఖ్యంగా శ్రీదేవి తల్లి కొంతమంది హీరోలకు ఇచ్చి పెళ్లి చేయాలని మంతనాలు కూడా జరిపింది. కానీ చివరికి బాలీవుడ్ నిర్మాతను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పటికే సౌత్ లో కమల్ హాసన్, రజినీకాంత్, రాజశేఖర్ వంటి కొంతమంది హీరోలను శ్రీదేవి తల్లి పెళ్లి చేసుకోమని అడిగినట్టు వార్తలు వినిపించాయి. కానీ చివరికి బాలీవుడ్ లో పెళ్లయి పిల్లలున్న నిర్మాత బోనీ కపూర్ ని శ్రీదేవి పెళ్లాడింది.అయితే బాలీవుడ్ నిర్మాత కంటే ముందే టాలీవుడ్ నిర్మాత కి తన కూతురినిచ్చి పెళ్లి చేయాలి అనుకుందట శ్రీదేవి తల్లి. 

కానీ ఆయన మాత్రం మొహం మీదే రిజెక్ట్ చేశారట. మరి ఇంతకీ శ్రీదేవిని రిజెక్ట్ చేసిన ఆ టాలీవుడ్ నిర్మాత ఎవరయ్యా అంటే.. మురళీమోహన్. నిర్మాతగానే కాకుండా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటుడుగా రాణించిన మురళీమోహన్ ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు. అలాగే రాజకీయ నాయకుడిగా కూడా పలు పదవులు చేపట్టారు. అయితే అలాంటి మురళీ మోహన్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోగా రాణించారు. ఇక మురళీమోహన్ పద్దతి, సాంప్రదాయాలు చూసి మురిసిపోయిన శ్రీదేవి తల్లి తన కూతురినిచ్చి పెళ్లి చేయాలి అనుకుందట. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే.. మురళీమోహన్ కి ముందే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే ఈ విషయం తెలియని శ్రీదేవి తల్లి శ్రీదేవిని తీసుకొని ఓ రోజు మురళీమోహన్ ఇంటికి డిన్నర్ కి వెళ్ళగా.. అక్కడ మురళీమోహన్ భార్య పిల్లల్ని చూసి షాక్ అయిందట. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని మురళీ మోహన్ ని అడగగా నాకు పెళ్లయి పిల్లలు ఉన్నారు అని మురళి మోహన్ షాక్ ఇవ్వడంతో ఇంట్లో వాళ్ళని చూసి శ్రీదేవి తల్లి ఆశ్చర్యంలో మునిగిపోయిందట.అయితే అప్పటివరకు శ్రీదేవి తల్లికి మురళీమోహన్ కి పెళ్లి అయింది అనే సంగతి తెలియదట. అలా టాలీవుడ్ నిర్మాత మురళీమోహన్ శ్రీదేవి ల పెళ్లి జరగలేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: