టాలీవుడ్‌కు బ‌ల‌గం... బాలీవుడ్‌కు చావా.. ఆస‌లు మాట‌ర్ ఇదే..!

frame టాలీవుడ్‌కు బ‌ల‌గం... బాలీవుడ్‌కు చావా.. ఆస‌లు మాట‌ర్ ఇదే..!

Amruth kumar
మన సిని ఇండస్ట్రీలో తెలంగాణ సంస్కృతి కనిపించేలా జబర్దస్త్ కమెడియన్ వేణు అందించిన 'బలగం' సినిమా. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సినిమాగా నిలిచింది. ఈ సినిమా చాలా చిన్న సినిమా అయినా యూత్ ఎట్రాక్ట్ అయ్యే విధంగా ఉండడం వలన మంచి క్రేజ్ లభించింది. తెలంగాణ మాట, భాష, యాసకు తగ్గట్లుగా ఈ సినిమాను నిర్మించారు. గ్రామాలు పట్నంలో కాకుండా పల్లెల్లో కూడా ఈ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సినిమాను మంచి పల్లెటూరు వాతావరణానికి తగ్గట్లుగా ఈ సినిమాను నిర్మించారు.

ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఫేమ్ తెచ్చింది .. ప్రతి గ్రామంలో స్క్రీన్ లను చూపించారు. ఈ సినిమా ప్రేక్షకుల మనసు కు హత్తుకునే విధంగా ఉంది. బలగం సినిమా నార్త్ ఇండియాలో, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్, యూపీ  ప్రాంతాలలో కూడా బలగం సినిమాకు మంచి క్రేజ్ ను వచ్చింది.అలానే ఇప్పుడు బాలీవుడ్ లో తాజాగా శివాజీ మహారాజ్ కుమారుడైన శాంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర ను తీసుకుని ..చేసినా చావా సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ విజ‌యం అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టికే దాదాపు రూ . 500 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాకుండా తెలుగులో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేశారు.

ఈ సినిమాలో హీరో గా విక్కీ కౌశల్ , హీరోయిన్ రష్మిక మందన్నా నటించి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి సక్సెస్ అందుకుంటుంది. అంతేకా కుడా  ఈ సినిమాను స్కూల్ విద్యార్థులకు చూపించే సినిమాగా చిత్రీకరించారు. శాంబాజీ మహారాజ్ జీవిత చరిత్ర కాబట్టి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సినిమాను చూస్తున్నారు. ఈ చావా సినిమా మరాఠీ సామ్రాజ్య యోధుని హీడెన్ చరిత్ర వెలుగులోనికి తెచ్చింది అంటూ సినీ ప్రేక్షకులు వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: