మహేష్ జక్కన్న మూవీ సైన్స్ ఫిక్షన్.. సినిమాపై అంచనాలు పెంచే న్యూస్ ఇదే!

frame మహేష్ జక్కన్న మూవీ సైన్స్ ఫిక్షన్.. సినిమాపై అంచనాలు పెంచే న్యూస్ ఇదే!

Reddy P Rajasekhar
ప్రస్తుతం తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాలలో మహేష్ బాబు జక్కన్న కాంబో మూవీ కూడా ఒకటి అనే సంగతి తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టెస్ట్ షూట్ మొదలు కాగా సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.
 
మహేష్ రాజమౌళి కాంబో మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూర్చున్న కుర్చీ వల్ల ఈ సందేహాలు తలెత్తుతున్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న కాంబో సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.
 
మహేష్ జక్కన్న కాంబో మూవీ సంచలనాలు సృష్టించే మూవీ అవుతుందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. మహేష్ రాజమౌళి కాంబో సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ రాజమౌళి కాంబో నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
 
మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించి లుక్స్ విషయంలో సైతం ఎంతో కేర్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మహేష్ బాబు రేంజ్ ఎన్నో రెట్లు పెరగడం పక్కా అని చెప్పవచ్చు. ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం ఊహించని స్థాయిలో నెలకొంది. మహేష్ బాబు మూవీ షూటింగ్ కు నమ్రత సైతం హాజరయ్యే అవకాశాలు లేవని జక్కన్న అలా కఠినంగా రూల్స్ విధించారని భోగట్టా.
 
రాజమౌళి మహేష్ సినిమాను వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. జక్కన్న ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటుండగా ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకునే దర్శకులు చాలా తక్కువమంది ఉంటారు. రాజమౌళి తన సినిమాలు సాధించిన అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: