సావిత్రి భర్త నటించిన ఒకే ఒక్క టాలీవుడ్ సినిమా .. ఆ మూవీ ఎంత స్పెషల్ అంటే..?

Amruth kumar
మహానటి సావిత్రి తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప లెజెండ్ .. ఎన్టీఆర్ , నాగేశ్వరాలకు పోటీగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న సావిత్రి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో మహానటిగా చెరిగిపోని ముద్ర వేసుకున్నారు .. అప్పట్లో తమిళ సీనియర్ హీరోలు ఎంజీఆర్ , శివాజీ గణేషన్ , జెమినీ గణేషన్ లాంటి హీరోల సినిమాలు తెలుగులో ఎక్కువగా డబ్‌ అయ్యేవి కావు .. డబ్బింగ్ హవా పెరిగింది రజినీకాంత్ , కమలహాసన్ టైమ్ నుంచే ఇక దాంతో జెమినీ గణేషన్ లాంటి లెజెండ్రీ న‌టుల నటన గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు.


సావిత్రి భర్త జెమినీ గణేషన్ అనే విషయం తెలిసిందే .. ఆయన్ని పెళ్లి చేసుకున్న తర్వాతే సావిత్రి కి కష్టాలు వచ్చాయి అని ప్రచారం కూడా ఉంది .. సావిత్రి ఉన్నప్పుడు జెమినీ గణేషన్ ఒక తెలుగు సినిమాలో కూడా నటించలేదు .. కానీ ఆమె చనిపోయిన తర్వాతే ఒకే ఒక్క తెలుగు సినిమాలో జెమినీ గణేషన్ నటించారు .. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు .. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ప్లాస్టిక్ క్లాసిక్  సినిమాగా మిగిలిపోయిన రుద్రవీణ .. ఈ సినిమాలో జెమినీ గణేషన్ చిరంజీవికి తండ్రిగా .. చాందస స్వభావం ఉన్న బ్రాహ్మణుడి పాత్రలో నటించారు .. అలాగే చిరంజీవి , జెమినీ గణేషన్ పోటీపడి ఇద్దరు నట విశ్వరూపం చూపించారు.


కే బాలచంద్రన్ దర్శకత్వంలో ఇళయరాజా సంగీతంలో చిరంజీవి సోదరుడు నాగబాబు ఈ సినిమాని 1998 లో నిర్మించారు .. అయితే ఈ సినిమాకి మూడు నేషనల్ అవార్డులు వచ్చాయి.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా నర్గీస్ దత్ అవార్డు తో పాటు ఉత్తమ సంగీత దర్శకుడుగా ఇళయరాజా , ఉత్తమ గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ సినిమాకి నేషనల్ అవార్డులు అందుకున్నారు . అదేవిధంగా ఈ సినిమాకి నాలుగు నంది అవార్డులు కూడా వచ్చాయి ..  బెస్ట్ డైలాగ్ రైటర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఇలా స్పెషల్ జ్యూరీ  విభాగాలో నంది అవార్డులు అందుకుంది. ఇలా జెమినీ గణేషన్ కేరీర్‌లో ఒకే ఒక్క తెలుగు సినిమాలో నటించినప్పటికీ అది గొప్ప మెమోరబుల్ సినిమాగా నిలిచిపోయింది . అయితే సావిత్రితో కూడా చిరంజీవి పునాది రాళ్లు చిత్రంలో నటించారు .. ఈ సినిమాలో వీరిద్దరివీ ముఖ్యమైన పాత్రలు కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: