పెళ్లి తర్వాత 3 సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన ఒకే ఒక్క నటి , పెళ్లయ్యాక బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన‌ భామ‌లు ఎవరంటే..?

Amruth kumar
ప్రపంచవ్యాప్తం గా మార్చి 8 న మహిళ దినోత్సవం జరుపుకుంటారు .. ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా సూపర్ హిట్ సినిమా లో నటించిన బాలీవుడ్ తారల గురించి ఈ స్టోరీ లో తెలుసుకుందాం . బాలీవుడ్ బ్యూటీ కాజల్ 1999 లో అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుంది .. పెళ్లి తర్వాత కభీ ఖుషీ కభీ గమ్ , మై నేమ్ ఈజ్ ఖాన్ లాంటి హిట్ సినిమాల్లో నటించింది .


మరో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ కరీనా కపూర్ కూడా 2012 లో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది .. ఈమె కూడా పెళ్లి తర్వాత ఉడ్తా పంజాబ్ , బజరంగీ భాయిజాన్ వంటి బ్లాక్ బస్టర్ విజయాల ను అందుకుంది . మరో బాలీవుడ్ అగ్ర నటి ప్రజెంట్ స్టార్ దీపికా పదుకొణె 2018 లో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్  ను పెళ్లి చేసుకుంది . పెళ్లి తర్వాత కూడా ఈ హీరోయిన్ పటాన్ , జవాన్ , కల్కీ లాంటి వరుస పాన్ ఇండియ విజ‌య‌ల‌ను అందుకుని 1000 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది .


మరో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణి ముఖర్జీ కూడా 2014 లో ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా ను పెళ్లి చేసుకుంది .. పెళ్లి తర్వాత కూడా రాణి ముఖర్జీ మర్దానీ , హిచ్కీ లాంటి హిట్ సినిమాల్లో నటించింది . మరో బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లా 1995 లో బిజినెస్ మాన్ జై మెహతాను పెళ్లి చేసుకుంది .. పెళ్లి తర్వాత కూడా ఈమె యస్ బాస్ , ఇష్క్ లాంటి హిట్ సినిమాలో నటించింది . బాలీవుడ్ లో పెళ్లి తర్వాత కూడా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన హీరోయిన్ల గా ఈ భామలు రికార్డ్ క్రియేట్ చేశారు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: