రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తునంత స్పీడ్‌గా మరే ఇతర టాలీవుడ్ హీరోలు సినిమాలు చేయట్లేదు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజ సాబ్’, హను రాఘవపూడితో ‘ఫౌజీ’ సినిమాలు చేస్తున్నాడు.ఆ తర్వాత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్ చేయనున్నాడు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 ఎలాగూ ఉండనే ఉన్నాయి. ఇదిలా ఉండగాప్రభాస్ లేటెస్ట్ సినిమాలలో రాజాసాబ్ ఒకటి ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతుంది. త్వరలో రెండు పాటల కోసం స్పేయిన్ వెళ్ళానున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లే. ఇదిలావుండగా తాజాగా ఈ హారర్ ఎంటర్టైనర్ కు సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా నిడివి దాదాపు 3గంటలు ఉంటుందని సమాచారం.ఈ నేపథ్యంలోనే బ్యాక్ టూ బ్యాక్ మాస్ సినిమాలు చేసిన ప్రభాస్ ఇప్పుడు ఎంటర్‌టైనింగ్ రోల్‌లో అలరించబోతున్నాడు. నవ్వించడం, భయపెట్టడంతోపాటు రొమాంటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట. అయితే ఇప్పుడు ప్రభాస్‌ని మాస్ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులు ఇలా రొమాంటిక్ బాయ్‌లా, కామెడీగా డార్లింగ్ ని చూస్తారా? అనేది పెద్ద డౌట్. ఇదిలా ఉంటే గ్లింప్స్ కూడా పెద్దగా హైప్ తెచ్చేలా లేదు.
అయితే ఈ సినిమాతో ఓ ప్రయోగం చేస్తున్నాడు డార్లింగ్. మొదటి సారి ఆయన హర్రర్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఎంటర్‌టైనింగ్ చిత్రాలు చేశాడు, మాస్ యాక్షన్ మూవీస్ చేశాడు ప్రభాస్. కానీ ఈ సారి మాత్రం హర్రర్ సినిమాతో అలరించేందుకు వస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇతర నటీనటులు డిటెయిల్స్ ప్రకటించేదు టీమ్. కానీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వివేక్ కూచిబొట్ల సహనిర్మాత. భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్ గా ఈ మూని నిర్మిస్తున్నారు. అయితే రాజాసాబ్ అనుకున్న సమయానికి రావడం లేదన్న వార్త ఒకటి మూవీ లవర్స్‌ను నిరాశ చెందేలా చేస్తుంది. రాజాసాబ్ విడుదల వాయిదా పడిందని వార్తలు వస్తుండగా.. మరోవైపు మీరు ఏ డేట్‌కు చూడాలనుకుంటే బాగుంటదో అదే తేదీన రాజాసాబ్ వస్తుందని మారుతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి రాజాసాబ్ విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.