ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లింగ్ సినిమాలు..!

frame ఓటీటీలో మిస్ కాకుండా చూడాల్సిన థ్రిల్లింగ్ సినిమాలు..!

MADDIBOINA AJAY KUMAR
ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో సమానంగా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల మీద కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక అలా థియేటర్లలో రిలీజ్ అవుతాయో లేదో.. ఇలా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంటాయి.
 
ఇక ఓటీటీ విషయానికి వస్తే.. ఇందులో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రతిరోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఓటీటీలు వచ్చినప్పటినుండి చాలా మంది థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడడం మానేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఎక్కువగా అందరి దృష్టి థ్రిల్లర్ సినిమాలపైనే ఉంది. ఇప్పుడు కొన్ని మంచి థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. థ్రిల్లర్ మూవీస్ అంటే మొదటగా గుర్తు వచ్చేది మలయాళం సినిమాలుయే. ఇక ఇటీవల విడుదల అయిన సూక్ష్మదర్శిని, మంజుమ్మల్ బాయ్స్, ఏ. ఆర్. ఎం, కిష్కింద కాండం సినిమాలు తప్పకుండా చూడాల్సినవి. వాటితో పాటుగా 2023లో రిలీజ్ అయిన కన్నూర్ స్క్వాడ్ సినిమా కూడా మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ, అలాగే హిందీ కిల్ సినిమా కూడా చూడదగ్గ సినిమా అని ప్రేక్షకులు కూడా చెప్పేశారు.    
 
ఇదిలా ఉండగా.. ఈ వారం సినిమా లవర్స్ కి పండగే పండగ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఏకంగా 19 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక ప్రస్తుతం థియేటర్ లలో విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ, బ్రహ్మ ఆనందం తెరకెక్కించిన బ్రహ్మ ఆనందం సినిమా, ఇట్స్‌ కాంప్లికేటెడ్‌ సినిమా, తల సినిమా, అలాగే విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన ఛావా సినిమాలు ఆడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: